గబ్బర్
సింగ్ తో సూపర్ హిట్
కొట్టి ఓవర్ నైట్ లో
స్టార్ డైరక్టర్ అయిన దర్శకుడు హరీష్
శంకర్. అతని కి ఇప్పుడు
ఇండస్ట్రీలో పెద్ద సంస్ధలు, హీరోలు
తమ తదుపరి చిత్రాలు కోసం భారీ మొత్తాల
ఎడ్వాన్స్ ఇచ్చేందుకు సమాయుత్తం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు ఎప్రోచ్ అయ్యి బుక్ చేసుకున్నట్లు
చెప్తున్నారు. వరస ఆఫర్స్ తో
ఉక్కిరి బిక్కిరి అవుతున్న హరీష్ శంకర్ కి
రెమ్యునేషన్ ఐదు నుంచి ఏడు
కోట్లు వరకూ పలుకుతున్నట్లు చెప్తున్నారు.
మిరపకాయతో హిట్ కొట్టినా రాని
క్రేజ్ ఒక్కసారిగా లాంగ్ గ్యాప్ తర్వాత
ఫామ్ లోకి వచ్చిన పవన్
కి హిట్ ఇవ్వటంతో వచ్చింది.
ఇక హరీష్ శంకర్ తన
తదపరి చిత్రం ఎన్టీఆర్ తో అని చెప్పారు.
అలాగే ఆ తర్వాత రవితేజతో
ఉంటుందని అన్నారు. ఎన్టీఆర్ తో చేసే సినిమాని
కొడాలి నాని నిర్మించనున్నారని తెలుస్తోంది.
ఇక ఎన్టీఆర్ తో చేసే చిత్రం
గతంలో ఎన్టీఆర్ కి చెప్పిన ఎమ్.ఎల్.ఎ స్క్రిప్టు
అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అప్పట్లో
నల్లమలుపు బుజ్జి నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా అనుకున్నారు కానీ వర్కవుట్ కాలేదు.
ఇప్పుడు వరసగా పెద్ద హీరోలంతా
హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాలని
ఉత్సాహపడుతున్నారు.
ఇక హరీష్ శంకర్ ఈ
చిత్రం విజయం గురించి చెపుతూ..."స్క్రిప్టులో మార్పులు చేశామని ప్రేక్షకుల్ని సంసిద్ధం చేయడానికే నేను టైటిల్కార్డులో
మార్పులు అని నా పేరు
వేసుకున్నాను. పవన్ అభిమానిగానే సినిమా
తీశాను. ఇప్పటికీ అదే భావనతో ఉన్నాను.
పరిశ్రమకు చెందిన ప్రముఖులు పలువురు ప్రశంసించారు అని అన్నారు.
అలాగే
సినిమాలో హైలెట్ అయిన అంత్యాక్షరి ఎపిసోడ్
గురించి చెపుతూ.. అంత్యాక్షరి సన్నివేశాన్ని ఎవరినీ ఉద్దేశించి చేయలేదు. పలువురు నటీనటుల్ని అనుకరించామంతే. అవమానించలేదు. ఆ సన్నివేశానికి పోలీసుల
నుంచి కూడా మంచి స్పందన
వస్తోంది. 'గబ్బర్సింగ్' పవన్ ఒన్మ్యాన్
షోగానే నడిచింది. పాటలు, డ్యాన్సుల పట్ల ఆయన గొప్పగా
శ్రద్ధ కనబరిచారు. సిగరెట్, మందు తాగే సీన్లు
చేయడానికి మా హీరో ఇష్టపడలేదు.
శ్రుతి మా సినిమాకు పెద్ద
ఎసెట్. మా సినిమాలో జంట
కొత్తగా ఉందని పలువురు కితాబిస్తున్నారు.
నేను జయాపజయాలను నమ్మను. కష్టాన్నే నమ్ముతాను'' అని హరీష్శంకర్
అన్నారు.
0 comments:
Post a Comment