మొన్న
శుక్రవారం విడుదలైన గబ్బర్ సింగ్ పాజిటివ్ టాక్
తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ
నేపధ్యంలో ఈ చిత్రానికి మరింతగా
బూస్ట్ చేయటానికి నిర్మాత పబ్లిసిటీ కాంప్యైన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా పవన్ ని ఇన్వాల్స్
చేయాలని, ఆయన ఇంటర్వూలు టీవి
ఛానెల్స్ లో ఇప్పించాలని నిర్ణయించుకున్నారట.
అయితే పవన్ అటువంటి పబ్లిసిటీ
తన సినిమాకు అవసరం లేదని, తను
హిట్టైతే జనం చూస్తారని, ప్లాపైనా
చెప్తే చూడరని, నేను వెళ్లి మరీ
సినిమా చూడమని చెప్పనని,నా క్యారక్టర్ ఇలా
చేసారని,ఆ సీన్ ఇలా
వచ్చిందని,మీడియా ముందుకు వచ్చి చెప్పనని నిష్కర్షగా
చెప్పేసాడని చెప్పుకుంటున్నారు. దాంతో పవన్ లేకుండానే
మిగతా ఆర్టిస్టులు,దర్శకుడుతో ఛానెల్స్ లో ఇంటర్వూలు ప్లాన్
చేస్తున్నట్లు తెలుస్తోంది. సక్సెస్ మీట్ కి సైతం
పవన్ రాలేదు.
ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా గబ్బర్
సింగ్ చిత్రం గురించే వినపడుతోంది. పవన్ కళ్యాణ్ చాలా
లాంగ్ గ్యాప్ తర్వత ఈ చిత్రం
ద్వారా హిట్ కొట్టారు. దాంతో
దాంతో అభిమానలకు విందు భోజనంలా మెప్పిస్తోంది.
పవన్ అబిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ
చిత్రం కొత్త రికార్డులను క్రియేట్
చేసే దిసగా సాగుతుందని చెప్తున్నారు.
పవన్ చెప్పే పంచ్ డైలాగులకు ధియోటర్
లో కంటిన్యూ విజిల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా సినిమా సెకండాఫ్ లో వచ్చే అంత్యాక్షరి
జనాలని మెప్పిస్తోంది.
అంత్యాక్షరి
లోని కామిడీని బయిట చెప్పుకుని చెప్పుకుని
నవ్వుకుంటున్నారు. అలాగే ప్రీ క్లైమాక్స్
లో వచ్చే కెవ్వు కేక
పాట కూడా బాగా కిక్కు
ఇస్తోంది. మలైకా ఆరోరా స్టెప్స్
కన్నా ఆ పాట చివర్లో
వచ్చే పవన్ అదరకొట్టాడం నచ్చుతోంది.
దానికి తోడు పవన్ పాటల్లో
మళ్లీ ఖుషీ నాటి ఉత్సాహం
కనపడి మురిపిస్తోంది. ఇది అవుట్ అండ్
అవుట్ పవన్ చిత్రం. పవన్
అవుట్ స్టాండిగ్ గా తన పాత్రలో
జీవించాడని చూసిన వారంతా అనటం
మౌత్ టాక్ స్పెడ్ అవుతోంది.
0 comments:
Post a Comment