నితిన్,
నిత్యా మీనన్ జంటగా రూపొందిన
‘ఇష్క్’
చిత్రం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ
చిత్రం విజయవంతంగా 7 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. పెద్ద స్టార్లు లేని
ఇలాంటి చిన్న బడ్జెట్ చిత్రం
ఇన్ని సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోవడం అంటే రికార్డే మరి!
100 రోజులు
పూర్తి చేసుకున్న సెంటర్లు
హైదరాబాద్
: శాంతి థియేటర్
వరంగల్
: లక్ష్మణ్ థియేటర్
ఖమ్మం
: సుందర్ మాక్స్
కరీంనగర్
: తీరంరాజ్ థియేటర్
నిజామాబాద్
: అశోక థియేటర్
వైజాగ్
: వి3 థియేటర్
విజయవాడ
: కాపరథి థియేటర్
నితిన్
మాట్లాడుతూ 'నా కెరీర్లో
'సై' సినిమా అనంతరం మళ్లీ అంతటి జెన్యూన్
హిట్‌టాక్ 'ఇష్క్' చిత్రానికి లభించింది. మౌత్‌టాక్ ద్వారా
ఈ సినిమా చాలా బాగుందన్న సమాచారం
ఎక్కువమందికి రీచ్ అయింది. క్లాస్లతో సంబంధం లేకుండా
ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చింది.
నా కెరీర్లో 'ఇష్క్' బిగ్గెస్ట్
హిట్‌గా నిలిచింది. ఈ
సినిమాకు వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్స్కు ధన్యవాదాలు. అందరికీ
మంచి పేరు, గుర్తింపును 'ఇష్క్'
తీసుకువచ్చిందని' అన్నారు.
నిత్యమీనన్మాట్లాడుతూ నేనే ఈ సినిమా
సక్సెస్ సాధిస్తుందని ముందే ఊహించాను. చిత్రీకరణ
జరుగుతున్నప్పుడే విజయంపై మా అందరికీ పూర్తి
నమ్మకం కలిగింది. అయితే ఈ రోజు
మా అంచనాలను మించి విజయాన్ని అందుకోవటం
విశేషం. గత ఏడాది 'అలా
మొదలైంది'. ఈ సంవత్సరం 'ఇష్క్'
సూపర్హిట్స్గా నిలవటం నాకు
చాలా ఆనందంగా ఉంది..తెలుగువారం దరికీ
నా ధన్యవాదాలన్నారు.
దర్శకుడు
విక్రమ్ కుమార్ మాట్లాడుతూ 'ఇష్క్' సినిమా సూపర్‌హిట్ అవడం
చాలా ఆనందంగా ఉంది. మేము ఊహించిన
దానికంటే పదిశాతం ఎక్కువగా ఈ సినిమా ప్రేక్షకాదరణ
పొందుతోంది. ఇదంతా మా టెక్నీషియన్స్,
నటీనటుల వల్లే సాధ్యమైందన్నారు.
నటుడిగా
మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న
నితిన్కు " ఇష్క్" మళ్లీ నూతనోత్తేజాన్ని ఇచ్చింది.
శ్రేష్టామూవీస్ పతాకంపై విక్రమ్ గౌడ్ నిర్మించిన చిత్రానికి
పి.సి.శ్రీరామ్ కెమెరామెన్.
అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
0 comments:
Post a Comment