మాస్
మహరాజ్ రవితేజ నటించిన ‘ దరువు’ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని విడుదలకు రంగం సిద్ధం అయిది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ
నెల 25న చిత్రాన్ని గ్రాండ్
గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్
గా నటిస్తోంది. శివ దర్శకత్వం వహించిన
ఈ చిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ శ్రీ వెంకటేశ్వర ఎంటర్
టైన్మెంట్స్ బేనర్ పై నిర్మించారు.
ఈ చిత్రంలో రవితేజ గతంలో ఎన్నడూ లేని
విధంగా సరికొత్తగా కనిపించబోతున్నాడు. పూర్తి మాస్ ఎంటర్టైనర్
గా రూపొందబోతున్న ఈ చిత్రంలో రవితేజ
ఐదు షేడ్స్ విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. గతంలో విక్రమ
హీరోగా వచ్చిన అపరిచితుడు సినిమాలో హీరో మూడు విభిన్నమైన
పార్శ్వాల్లో కనిపిస్తాడు. అదే తరహాలో రవితేజ
ఇందులో ఐదు పార్శ్వాల్లో కనిపించబోతున్నాడని
తెలుస్తోంది. ఇప్పటి వరకు అల్లరి చిల్లర
రౌడీ క్యారెక్టర్లతో కామెడీ హీరోగా కనిపించిన రవితేజ ఈ సినిమాలో తనలోని
అసలైన నటుడిని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.
ఇక రవితేజ క్యారెక్టర్ గురించి దర్శక నిర్మాతలు చెపుతూ…అతను
పక్కా మాస్. మనిషి మాస్క్
వేసుకున్న ట్రాన్స్ఫార్మర్లాగా పూర్తి ఎనర్జీతో
ఉంటాడు. శత్రువులకు అతనంటే బెదురే. అతగాడు దరువేశాడంటే భూగోళం దద్దరిల్లాల్సిందే. ఈ తరహా మనస్తత్వంతోనే
రవితేజ పాత్రను తీర్చిదిద్దాం అన్నారు. అలాగే కొంచెం యాక్షన్కి, ఇంకొంచెం సున్నితమైన
భావోద్వేగాలకూ చోటుంటుంది. ఈ కొలతలతో మరో
సినిమా సిద్ధమైపోతోంది. ఈసారి మాత్రం వినోదాల
సౌండ్ ఎక్కువే. మాస్తో తీన్మార్ ఆడించే కథతో
వస్తున్నారని చెప్పారు.
బ్రహ్మానందం,
సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అవినాష్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ
చిత్రానికి కథ, స్క్రీన్ప్లే:
శివ, ఆదినారాయణ, సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా:
వెట్రివేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: నాగమునీశ్వరి.
0 comments:
Post a Comment