హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ విజయవాడ నాయకుడు వల్లభనేని వంశీ వ్యవహారంతో తనకు
సంబంధం అంటగడుతూ వచ్చిన వార్తలపై మొదటి సారి సినీ
హీరో జూనియర్ ఎన్టీఆర్ పెదవి విప్పారు. చాలా
రోజుల తర్వాత రాజకీయాలపై ఆయన తన మాట
వినిపించారు. వల్లభనేని వంశీ వ్యవహారాన్ని తనకు
ముడిపెట్టవద్దని ఆయన సూచించారు. వంశీ
తనతో సినిమా తీసిన నిర్మాత మాత్రమేనని
ఆయన చెప్పారు. తనంటే గిట్టనివారు చేసే
ప్రచారంపై తాను స్పందించలేనని ఆయన
అన్నారు.
తనకు
సంబంధం లేని విషయాలను తనకు
అంటగట్టడం సరి కాదని ఆయన
అన్నారు. తనకు తెలియని విషయాలపై
తాను స్పందించలేనని ఆయన అన్నారు. తనకు
ఎవరితోనూ మనస్పర్థలు లేవని ఆయన స్పష్టం
చేశారు. తెలుగుదేశం పార్టీతో తనకు ఏ విధమైన
విభేదాలు లేవని ఆయన చెప్పారు.
తనకు రాజకీయాలు తెలియవని ఆయన అన్నారు.
తనకు
ఇప్పుడు 28 ఏళ్లని, తాను రాజకీయాల్లోకి వస్తానో
రాదో కూడా తెలియదని ఆయన
చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడం తన బాధ్యత
అని ఆయన చెప్పారు. తన
తాత స్వర్గీయ ఎన్టీ రామారావు తనకు
ఆదర్సమని ఆయన చెప్పారు. తెలుగుదేశం
పార్టీ విజయానికి కృషి చేస్తానని, తన
తాతాగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో ఉంటానని ఆయన చెప్పారు.
తనకు
ఇప్పటి నుంచే రాజకీయాలను ఆపాదించడం
సరి కాదని, రాజకీయాల్లో ఉన్నవారిని అడిగితే రాజకీయాలు మాట్లాడుతారని ఆయన అన్నారు. తాను
ఒక్కసారి స్టాండ్ తీసుకున్నానంటే ఆ స్టాండ్ మీద
చచ్చేవరకు ఉంటానని ఆయన చెప్పారు. జూనియర్
ఎన్టీఆర్ మాట్లాడిన విషయాలు వివిధ టీవీ చానెళ్లలో
శనివారం రాత్రి ప్రసారమయ్యాయి.
సినిమాలు
తనకు బతుకుదెరువు అని ఆయన చెప్పారు.
వంశీ తనతో అదుర్స్ సినిమా
మాత్రమే తీశారని ఆయన చెప్పారు. తాను
2009లో ఓ వైఖరి తీసుకున్నానని
ఆయన చెప్పారు. నందమూరి తారక రామారావు స్థాపించిన
పార్టీకి తాను ఎందుకు దూరమవుతానని
ఆయన అడిగారు. తన కుటుంబం యావత్తూ
తెలుగుదేశం పార్టీతోనే ఉంటుందని ఆయన చెప్పారు. తన
తాత స్థాపించిన పార్టీ తనకు దైవంతో సమానమని
ఆయన అన్నారు.
0 comments:
Post a Comment