గడచిన
సంవత్సరం డిసెంబర్ నెలలో (డిసెంబర్ 4, 2011) అమెరికాకు చెందిన కార్ కంపెనీ ఫోర్డ్
ఇండియా ఆర్థరాత్రి అమ్మకాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం
ఎనిమిది గంటల నుండి అర్థరాత్రి
వరకూ అమ్మకాలు నిర్వహిస్తూ, పరిమిత సంఖ్యలో నమ్మశక్యం కాని ఆఫర్లతో ఫోర్డ్
కొనుగోలుదారులు మరోసారి ఆకట్టుకోవటానికి ముందుకు వచ్చేసింది.
ఫోర్డ్
ఇండియా మరోసారి మిడ్నైట్ సేల్ను నిర్వించాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా రేపు (మే 13, 2012, ఆదివారం)
ఉదయం 8 గంటల నుండి అర్థరాత్రి
వరకూ అమ్మకాలను నిర్వహించటమే కాకుండా, వివిధ కార్లపై భారీ
డిస్కౌంట్లను, ఆకర్షనీయమైన వడ్డీ స్కీమ్లను,
లక్కీ డ్రాలను, వివిధ బహుమతులను అందజేయనుంది.
ఈ మిడ్నైట్ సేల్లో భాగంగా ఫోర్డ్
ఇండియా వివిధ కార్లపై అందిస్తున్న
డిస్కౌంట్లు, ఆఫర్ల వివరాలు ఇలా
ఉన్నాయి:
* ఫోర్డ్
ఫిగో:
రూ.24,500
వరకూ బెనిఫిట్స్
ప్రారంభ
ధర రూ.3.81 లక్షలు
* ఫోర్డ్
గ్లోబల్ ఫియస్టా:
ఆకర్షనీయమైన
10.99 శాతం వడ్డీ రేటు
ప్రారంభ
ధర రూ.7.35 లక్షలు
* ఫోర్డ్
ఫియస్టా క్లాసిక్:
రూ.54,500
వరకూ బెనిఫిట్స్
ప్రారంభ
ధర రూ.5.54 లక్షలు
* ఫోర్డ్
ఎండీవియర్:
ఆకర్షనీయమైన
10.99 శాతం వడ్డీ రేటు
ప్రారంభ
ధర రూ.17.84 లక్షలు
(పైన
పేర్కొన్న అన్ని ధరలు కూడా
ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దేశవ్యాప్తంగా 123 నగరాల్లో తమ షోరూమ్లు
రేపు (మే 13, 2012, ఆదివారం) ఉదయం 8 గంటల నుండి అర్థరాత్రి
వరకూ తెరచి ఉంటాయని కంపెనీ
తెలిపింది. ఈ ఆదివారం ఫోర్డ్
కారును బుక్ చేసుకున్న వారికి
ప్రత్యేక తగ్గింపులతో పాటు, ఆకర్షనీయమైన వడ్డీ
రేట్లు, ఎల్ఈడీ టీవీలు,
క్యామ్కార్డర్లు, టచ్ స్క్రీన్ మొబైళ్లు,
డీవీడీ ప్లేయర్లు వంటి మొత్తం రూ.2
కోట్ల విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాలున్నాయని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్, సేల్స్, సర్వీస్) నెగైల్ ఈ వార్క్ పేర్కొన్నారు.
మరింకెందుకు ఆలస్యం, రేపు ఫోర్డ్ షోరూమ్కి వెళ్లి మీ
డ్రీమ్ కారును సొంతం చేసుకునేందుకు సిద్ధంకండి.

0 comments:
Post a Comment