నెల్లూరు:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి హంతకుడు అనేందుకు నిదర్శనం మాజీ మంత్రి పరిటాల
రవీంద్ర హత్యేనని, ఇందుకు సాక్ష్యం పులివెందుల కృష్ణ అని తెలుగుదేశం
అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఆరోపించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని
ప్రారంభించారు. నర్రవాడలో కార్యకర్తల సమావేశం అనంతరం వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు మండలాల్లో రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైయస్సార్
అధికారంలో ఉండగా రెండువందల మంది
టిడిపి కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిటాల రవిని చంపేస్తారని తెలిసి
ముందుగానే అప్పటి ప్రభుత్వాన్ని తాము హెచ్చరించినా ఫలితం
లేకపోయిందన్నారు. తండ్రి బాటలోనే తనయుడు నడుస్తూ హత్యా రాజకీయాలు, సెటిల్మెంట్లు చేస్తుండటంతో ప్రజల ఆస్తులకు రక్షణ
లేకుండా పోయిందన్నారు.
రాష్ట్రంలో
సంఘ విద్రోహశక్తులు ఉన్నాయని, ఇందుకు తమ వద్ద సాక్ష్యాధారాలు
కూడా ఉన్నాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆ సాక్ష్యాలను బయటపెట్టి
చర్యలు తీసుకుని ప్రజలను రక్షించాలని కోరారు. ఇలా ప్రకటనలు చేసే
సిఎం అసమర్ధుడు, చేతగాని దద్దమ్మ అంటూ ఆగ్రహం వ్యక్తం
చేశారు. కెసిఆర్, జగన్లు దోపిడీ
సొమ్ముతో పత్రికలు పెట్టి ఇతరులపై బురద జల్లుతున్నారని బాబు
అన్నారు.
జగన్
పత్రికకు ఏదో అన్యాయం జరిగిందని,
ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందంటూ ఆరోపించడం
విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి, బుచ్చయ్య చౌదరిలపై ఓ చానల్ కల్లబొల్లి
కబుర్లతో ప్రచారాలు చేస్తోందన్నారు. పత్రికలన్నా, పత్రికా స్వేచ్ఛ అన్నా తాను ఎంతో
గౌరవిస్తానని, పదహారేళ్లకు పైగా టిడిపి అధికారంలో
ఉన్నా తమకు సొంత మీడియా
అంటూ లేదన్నారు.
గతంలో
అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ప్రభుత్వ ఫలాలు అందించాలన్న ఆలోచనతో
ఉద్యోగులను కొంతమేర బాధ పెట్టినమాట వాస్తవమేనని
చంద్రబాబు చెప్పారు. ఇకమీదట ఉద్యోగులు, పెన్షనర్లకు అన్ని విధాలా సహాయ
సహకారాలు అందిస్తామన్నారు. దీని కోసం ఉద్యోగులు
టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నానన్నారు.
0 comments:
Post a Comment