న్యూఢిల్లీ:
జులై 27 ఎప్పుడెప్పుడూ వస్తుందా అంటూ ప్రపంచంలో ఉన్న
ఒలింపిక్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంతకీ
జులై 27 ప్రత్యేకత ఏంటీ అని అనుకుంటున్నారా..
జులై 27వ తారీఖున లండన్లో ఒలింపిక్స్ మొదలయ్యే
రోజు. ఈరోజు కోసం ప్రపంచం
మొత్తం ఎంతే ఆసక్తిగా ఎదురు
చూస్తుంది. ప్రపంచంలో వివిద దేశాల నుండి
వచ్చే ఆటగాళ్లు అందరికి గ్రేట్ బ్రిటన్ ఈ కార్యక్రమం సందర్బంగా
ఆహ్వానం పంపింది.
ఐతే ఈసారి లండన్ ఒలింపిక్స్లో భారత్ బ్యాడ్మింటన్
తొలిసారి ఓ అరుదైన రికార్డుని
నమోదు చేసింది. ఎప్పుడు ఒలింపిక్స్ జరిగినా భారత్ బ్యాడ్మింటన్ నుండి
కేవలం ఇద్దరు మాత్రమే ఇందులో పాల్గోనేవారు. కానీ ఈ సారి
లండన్ ఒలింపిక్స్లో మాత్రం భారత్
తరపున ఐదుగురు ఆటగాళ్లు పాల్గోనున్నారు. మహిళల సింగిల్స్లో
టాప్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్కు
మొదటినుంచీ అవకాశం ఉండగా... గత వారం ముగిసిన
ఇండియా ఓపెన్ తర్వాత మరో
నలుగురి పేర్లు ఖరారయ్యాయి. గురువారం ప్రకటించిన బీడబ్ల్యుఎఫ్ ర్యాంకుల ప్రకారం ఈ జాబితాను అధికారికంగా
ప్రకటించారు.
తాజా
ర్యాంకింగ్స్లో పురుషుల సింగిల్స్లో 24వ ర్యాంకుకు
చేరుకున్న పారుపల్లి కశ్యప్ భారత్ తరుపున నెంబర్వన్గా నిలిచాడు.
దీంతో 26వ స్థానంలో ఉన్న
అజయ్ జయరామ్ను వెనక్కి నెట్టి
లండన్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు.
మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల-అశ్విని (16వ ర్యాంకు)తో
పాటు పొన్నప్ప జోడి అర్హత పొందింది.
మిక్స్డ్ డబుల్స్లో
కూడా జ్వాల గుత్తా - దిజు
(14వ ర్యాంకు)లు ఒలింపిక్స్కు
క్వాలిఫై అయ్యారు. రెండు విభాగాల్లోనూ నేరుగా
అర్హత పొందిన తొలి భారత క్రీడాకారిణి
జ్వాల గుత్తా గర్తింపుని పొందారు.
0 comments:
Post a Comment