లాస్
ఏంజిల్స్: ప్రపంచంలో అత్యంత దుర్మార్గుడిగా పేరొందిన ఇరాక్ నియంత సద్దాం
హుస్సేన్ జీవితం ఆధారంగా హాలీవుడ్లో ఓ సినిమాని
తెరకెక్కించనున్నారు. ఈ సినిమా పేరు
'మిషన్: బ్లాక్ లిస్ట్'. ఈ సినిమాలో హీరోగా
నటించేందుకు గాను ప్రపంచంలో సెక్సీయస్ట్
మ్యాన్ స్దానాన్ని కైవసం చేసుకున్న ట్విలైట్
స్టార్ 'రాబర్ట్ ప్యాటిన్సన్' ముందుకొచ్చాడు.
వాస్తవిక
జీవితంలో మిలిటరీ ఇంటరాగేటర్గా పని చేసిన
ఎరిక్ మేడాక్స్ రచించిన నవల ఆధారంగా తీయనున్నారు.
ఇంతకీ ఎవరీ ఎరిక్ మైడాక్స్
అని అనుకుంటున్నారా.. సద్దాం హుస్సేన్ కోసం అన్వేషణలో సహాయపడింది
ఇతనే. ఈ చిత్రంలో 'రాబర్ట్
ప్యాటిన్సన్' ఈ ఎరిక్ మేడాక్స్
పాత్రను పోషించనున్నారు.
సద్దాం
హుస్సేన్ని 2003లో బంధించి 2006లో
ఉరిశిక్ష అమలు చేసిన విషయం
తెలిసిందే. ఇక ఈ సినిమాకు
దర్శకత్వ బాధ్యతలను జీన్-స్టిఫానే సావైర్
వహిస్తున్నాడు.
0 comments:
Post a Comment