హైదరాబాద్:
కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లోని ఇద్దరు మంత్రులు
శుక్రవారం ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవర్టు అన్న మంత్రి డిఎల్
రవీంద్ర రెడ్డి వ్యాఖ్యలపై మరో మంత్రి ఏరాసు
ప్రతాప రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిఎల్ వ్యాఖ్యలు సరికాదన్నారు.
ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డిఎల్కు ఇష్టం లేకుంటే
మంత్రి పదవికి రాజీనామా చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిని మాత్రం విమర్శించడం సరికాదన్నారు. డిఎల్ విషయంలో పార్టీ
అధిష్టానం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తే పార్టీకే నష్టమని ఆయన అన్నారు. ఆయనపై
పార్టీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిఎంను కోవర్టని అనడం సరికాదన్నారు. జగన్ను ఆయన స్థాయిలోనే
విమర్శిస్తారని అన్నారు. ఏరాసు వ్యాఖ్యలకు మంత్రి
డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా తీవ్రంగానే స్పందించారు.
ఆడా మగ కాని వారే
తనపై విమర్శలు చేస్తున్నారని డిఎల్ విమర్శించారు. పార్టీని
నష్టపరుస్తుంది ఎవరో అందరికీ తెలుసునన్నారు.
పార్టీకి నష్టం చేసే వాళ్లే
ఉన్నత స్థానాలలో ఉన్నారని ఆయన చెప్పారు. తాను
అధిష్టానానికి మాత్రమే విధేయుడినని చెప్పారు. తనపై విమర్శలు ఆపాలని,
లేకుంటే మరింత ఘాటుగా స్పందించాల్సి
వస్తుందని చెప్పారు. తాను ప్రదేశ్ కాంగ్రెసు
కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మర్యాద
పూర్వకంగానే కలిశానని చెప్పారు.
తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు కలవలేదని
చెప్పారు. ఏ పరిస్థితుల్లో ఆ
వ్యాఖ్యలు చేశారని బొత్స తనను అడిగితే
చెప్పానన్నారు. తాను మంత్రి పదవికి
రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.
డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర
దుమారం రేపిన విషయం తెలిసిందే.
కాగా శుక్రవారం ఉదయం డిఎల్ రవీంద్రా
రెడ్డి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో
భేటీ అయ్యారు. ఆ తర్వాత బొత్స
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో
భేటీ అయ్యారు.
0 comments:
Post a Comment