ఎన్టీఆర్
తాజా చిత్రం దమ్ము కలెక్షన్స్ వైజ్
అన్ని చోట్ల నుంచి మంచి
రిపోర్టే ఉంది. తాజాగా చెన్నై
ఫిల్మ్ ట్రైడ్ ఎనాలిసిస్ట్...శ్రీధర్ పిళ్లై ఇచ్చిన ట్వీట్ ప్రకారం... దమ్ము రెండో స్ధానంలో
ఉంది. నిజానికి దమ్ము తమిళ వెర్షన్
అక్కడ రిలీజ్ కాలేదు. కేవలం తెలుగు వెర్షన్
మాత్రమే విడుదలైంది. పాతిక స్క్రీన్స్ తో
అక్కడ ఈ చిత్రం విడుదలైంది.
ఇక తమిళ దమ్ము వెర్షన్...
మే 4న విడుదల కానుంది.
తమిళ వెర్షన్ కి మరింత ఆదరణ
ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు.
ఇక ఆ ట్వీట్ విషయానికి
వస్తే... అందులో... చెన్నై టాప్ త్రీ 1) ది
ఎవేంజర్స్ 2) చెన్నైలో పెద్ద ఆశ్చర్యం..శుక్రవారం
ఓపినింగ్స్ లో ఎన్టీఆర్ దమ్ము
(3) లీలై.... అలాగే... దమ్ము(తెలుగు)వీకెండ్
తర్వాత కూడా స్టడీగా ఉంది.
తమిళ వెర్షన్ ఈ శుక్రవారం వస్తోంది
అన్నారు. ఇక ట్వీట్ ఎన్టీఆర్
అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుందనటంతో విచిత్రం లేదు. వారు తమిళ
దమ్ము వెర్షన్ కూడా మంచి క్రేజ్
తెచ్చుకుంటుందని భావిస్తున్నారు.
తెలుగు
సినిమాలను నేరుగా తెలుగులో తమిళనాట 25 స్క్రీన్లలో రిలీజ్ చేయడం ఇటీవల కాలంలో
పోలిస్తే రికార్డే స్థాయి అని చెప్పుచ్చు. తమిళంలో
డబ్బింగ్ చేసి విడుదల చేస్తే
ఇది చిన్న సంఖ్యే. కానీ
‘దమ్ము’
చిత్రం తమిళంలో డబ్ చేయకపోవటంతో రికార్డుగా
క్రియేట్ అయ్యింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీయార్
కు జోడీగా త్రిష, కార్తీక నటించారు. సీనియర్ నిర్మాత కె.యస్. రామారావు
తనయుడు అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని
నిర్మించారు. ఎక్కువ సెంటర్లలో రిలీజ్ చేయటంతో పాత రికార్డుల్నిఆ సినిమాలు
అతి తక్కువ సమయంలోనే క్రాస్ చేస్తున్నాయి.
ఇక దమ్ము చిత్రం ప్రారంభం
రోజు టాక్ యావరేజ్,క్లైమాక్స్
వీక్ అని వచ్చినా కలెక్షన్స్
మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఈ
వీకెండ్ అనంతరం వచ్చే సోమవారం కలెక్షన్స్
ని బట్టి చిత్రం స్దాయిని
అంచనా వేస్తారు. ఎందుకంటే మొదటి వారం కేవంల
అబిమానులు ఏ సినిమానైనా చూస్తూంటారు.
టాక్ ని బట్టి ఫ్యామిలీలు
కదిలేది వారం తర్వాతే కాబట్టి
ట్రేడ్ లో లెక్కలు అలా
వేస్తారు. ఇక బోయపాటి శ్రీను
సైతం ఈ చిత్రం కలెక్షన్స్
పై ధీమాగా ఉన్నాడు. మీడియాతో ఓ రేంజిలో పబ్లిసిటీ
చేస్తున్నారు. అన్ని ఛానెల్స్ లోనూ
బోయపాటి శ్రీను ఇంటర్వూలు ఇస్తూ ఈ సినిమాకు
మరింత క్రేజ్ తెచ్చే పనిలో ఉన్నాడు.
0 comments:
Post a Comment