విక్రమ్,
జగపతి బాబు, అనుష్క, లక్ష్మీరాయ్,
ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'తాండవం'. విజయ్ దర్శకత్వం వహిస్తున్న
ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ గా నెగిటిల్
రోల్ ని చేస్తున్నట్లు సమాచారం.
సెకండ్ హీరో రోల్ అని
చెప్తున్నా అది విలన్ రోల్
అని కోలివుడ్ లో చెప్తున్నారు. ప్రముఖ
నిర్మాణ సంస్థ యూ టీవీ
మోషన్ పిక్చర్స్ తెలుగు, తమిళ భాషల్లో అత్యంత
ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది.
రోనీ స్క్రూవాలా, సిద్దార్థ్రాయ్కపూర్ నిర్మాతలు.
సినిమా
ప్రోగ్రెస్ గురించి నిర్మాతలు మాట్లాడుతూ "ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ జరిపాం.
ప్రస్తుతం లండన్లో యాభై
రోజుల షెడ్యూల్ జరుపుతున్నాం. తెలుగు, తమిళ భాషల్లో ఏక
కాలంలో చిత్రాన్ని నిర్మిస్తున్నాం. తొలి షెడ్యూలును ఢిల్లీలో,
రెండో షెడ్యూలును చెన్నైలో నిర్వహించాం. ఇప్పటివరకు తన కెరీర్లో
పోషించనటువంటి వైవిధ్యమైన పాత్రను విక్రమ్ పోషిస్తున్నారు. ఎంతో ప్రతిభావంతులైన జగపతిబాబు
ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
యుటీవీ బేనర్లో ఇది
భారీ బడ్జెట్ సినిమా'' అని చెప్పారు.
విక్రమ్‌ని ‘నాన్న’గా తెలుగు ప్రేక్షకులకు
చూపించిన ఎ.ఎల్.విజయ్
ఈ చిత్రానికి దర్శకుడు. అనుష్క, లక్ష్మీరాయ్, అమీ జాక్సన్ హీరోయిన్లు.
50 రోజుల పాటు జరిగే ఈ
భారీ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను
చిత్రీకరిస్తున్నారు. నటుడిగా విక్రమ్లోని కొత్త కోణాన్ని
ఈ సినిమా ఆవిష్కరిస్తుందని, వాణిజ్య పరంగా సంచలనాన్ని సృష్టించే
సినిమా ఇది అవుతుందని దర్శకుడు
చెబుతున్నారు.
ఇక ఈ చిత్రంలో జగపతి
బాబు పాత్ర కీలకంగా కథలో
మలుపుని తీసుకువస్తుందని చెప్తున్నారు. అనుష్కకు విలన్ గా ఆ
పాత్ర కనిపిస్తుందని అంటున్నారు. జగపతి బాబు, అనుష్క
మధ్యన వచ్చే సన్నివేశాలు సినిమా
హైలెట్స్ లో నిలుస్తాయని చెప్తున్నారు.
జగపతి బాబుని పెట్టడం ద్వారా తెలుగు మార్కెట్లో సైతం ఈ సినిమాకు
మంచి రేటు పలికే అవకాశముంది.
శాటిలైట్ రైట్స్ సైతం ఈ సినిమాకు
బాగా వస్తాయి. కోట శ్రీనివాసరావు, నాజర్,
సాయాజీ షిండే, సంతానం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న
ఈ చిత్రానికి కెమెరా: నీరవ్ షా, సంగీతం:
జీవీ ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: ఆంటోని.
0 comments:
Post a Comment