నాగార్జున
హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డమరుకం'. గత ఆరు నెలలుగా
పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్న ఈ
చిత్రం జూలై మొదటి వారంలో
విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గతంలో మార్చి 27న
ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశముందని నాగార్జున
తెలిపారు. అయితే గ్రాఫిక్స్ లేటవటంతో
రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఢమురుకం
చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా
చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్
శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ
శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా
మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. రక్త చరిత్రలో చేసిన
అభిమన్యు సింగ్ ఇందులో విలన్
గా కనిపించనున్నారు.
ఆ మధ్యన ఈ చిత్రం
కోసం కాశిలో కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు. అరుంధతి తరహా ఆఘోరా పాత్రకు
సంభందించిన సీన్స్ అవి అని సమాచారం.
అరుంధతిలో సోనూసూద్ కి డబ్బింగ్ చెప్పిన
రవిశంకర్ ఈ పాత్రను ఈ
సినిమాలో పోషిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ పాత్ర ఇంటర్వెల్
దగ్గర ఇచ్చే ట్విస్ట్ సినిమాకి
కీలకమై నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. దైవ శక్తికీ, దుష్ట
శక్తికీ జరిగే పోరాటమే ఈ
చిత్రం కథ అని తెలుస్తోంది.
ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన
యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో
యముడు భూమి మీదకు వస్తాడు.
ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి
దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ
మధ్య జరిగే కథనం ఆసక్తి
గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా
మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్
తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది
అన్నారు. ఆర్.ఆర్.మూవీ
మేకర్స్ వారు ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు.
అలాగే
ఈ చిత్రంలో దాదాపు గంటసేపు గ్రాఫిక్స్ ఉంటాయని,తెలుగు తెరపై ఇప్పటివరకూ చూడని
విధంగా వాటిని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఫస్టాఫ్ మొత్తం కామిడీగా సాగినా,ఇంటర్వెల్ అదిరిపోతుందని చెప్తున్నారు. ప్రస్తుతం నాగార్జున చేస్తున్న షిర్టీ సాయి షూటింగ్ కూడా
పూర్తైంది. దాంతో ముందుగా షిర్టీ
సాయిని విడుదల చేయాలా లేక ఢమురకం రిలీజ్
చేయాలా అన్న ఆలోచనలో ఉన్నారు.
షిర్డీ సాయి చిత్రాన్ని ప్రముఖ
దర్శకుడు రాఘవేంద్రరావు డైరక్ట్ చేసారు.
0 comments:
Post a Comment