2009 ఎన్నికల్లో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం ప్రజారాజ్యం పార్టీకి ఎంత ప్లస్సయిందో కొత్తగా
చెప్పక్కర్లేదు. ప్రత్యర్థి పార్టీలను పవన్ కళ్యాణ్ ఏకేసిన తీరు రాజకీయాలపై ఆయకు ఉన్న
మంచి అవగాహనకు నిదర్శనమని ఆప్పట్లో అందరూ చర్చించుకున్నారు.
అప్పటి నుంచి
చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు.... పవర్ స్టార్ ఓ రాజకీయ సినిమా తీస్తే బాగుంటుంది,
ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి, సీఎం అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని సినిమాలో చూపించి
ప్రజల్లో చైత్య కల్పించాలని ఆశ పడుతున్నారు. ఈ విషయాన్ని కొందరు అభిమానులు పవన్ కళ్యాణ్
దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
అయితే అన్నయ్య
రాజకీయాల్లో ఉన్నందున తాను పొలిటికల్ సెటైర్ సినిమా తీస్తే బాగోదని పవన్ కళ్యాణ్ పెద్దగా
ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలో కొందరు అభిమానులు తమకు తాముగా తమ క్రియేటివిటీకి
పదును పెట్టి పవన్ కళ్యాణ్‌ను సీఎం చేశారు. ‘ఒకే ఒక్కడు’ తరహాలో ‘మనలో ఒక్కడు’
అనే టైటిల్ తగిలించి ఈ చిత్రానికి
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకుడుగా, బండ్ల గణేష్ ను నిర్మాతగా, ఏఆర్ రెహ్మాన్ ను సంగీత
దర్శకుడుగా, పిసి శ్రీరామ్‌ను సినిమాటో గ్రాఫర్ గా పెట్టారు. ఇదంతా ఓ క్రియేటివిటీ.
ఎవరి ఆనందం వారిది.
కాగా.... అభిమానులు
చేస్తున్న ఈ హడావుడి నేపథ్యంలో పలువురు దర్శకులు ఆలోచనలో పడ్డారు. అభిమానులు కోరుకుంటున్నట్లు
అలాంటి సినిమా తీస్తే బాగానే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. కానీ చిరంజీవి
రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమాలు ఒప్పుకోడని తెలిసి అంతా లైట్
తీసుకుంటున్నారట.
0 comments:
Post a Comment