ఈ సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమకు బాగా
కలిసొస్తోంది. ఐదు నెలలు కూడా
పూర్తి కాలేదు పరిశ్రమలో అప్పుడే ఐదు భారీ హిట్
చిత్రాలతో పాటు, పలు విజయవంతమైన
సినిమాలు పలకరించాయి. సూపర్ స్టార్ మహేష్
బాబు నటించి ‘బిజిజెస్ మేన్’ ఈ ఏడాది తొలి
హిట్ చిత్రంగా నిలువగా...ఆ తర్వాత వచ్చిన
దమ్ము, ఈ రోజుల్లో, ఇష్క్,
రచ్చ చిత్రాలు బాక్సీఫీసు వద్ద సెన్సేషన్ నమోదు
చేశాయి. తాజాగా విడుదలైన ‘గబ్బర్ సింగ్’ చిత్రం కూడా కెవ్వు కేక
పెట్టిస్తోంది.
ఈ సంవత్సరం వరుస చిత్రాలు విజయవంతానికి
మరో కారణం కూడా ఉంది.
ఈ చిత్రాలన్నీ ఫుల్ ఫెడ్జ్ ఎటర్టైన్మెంట్ కాన్సెప్టుతో రూపొందించడమే. గత సంవత్సరం వరుస
పరాజయాల నేపథ్యంలో మూస కథలను పక్కన
పెట్టిన దర్శకులు ఈ సారి ప్రేక్షకులను
అలరించే సబ్జెక్టులపై దృష్టిపెట్టారు.
ఈ ఐదు చిత్రాలే కాక...ఈ సంవత్సరం మరిన్ని
పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. రాజమౌళి ‘ఈగ’ చిత్రం ఈ నెలాఖరున విడుదలవుతోంది.
సైన్స్ ఫిక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అద్భుతంగా రూపొందుతున్న
ఈచిత్రం సగటు తెలుగు ప్రేక్షకుడిని
అలరించడం ఖాయం.
దీంతో
పాటు బాలకృష్ణ ‘అధినాయకుడు’ చిత్రంపై కూడా అంచనాలు భారీగా
ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్య
మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించడమే ఇందుకు కారణం. గత సంవత్సరం ‘కందిరీగ’తో హిట్ ఇచ్చిన రామ్
‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రం ద్వారా వస్తున్నాడు. అదే విధంగా యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ ‘రెబల్’,
‘వారధి’
చిత్రాలతో బాక్సాఫీసుపై దూకేందుకు సిద్దం అవుతున్నాడు.
మరో వైపు వెంకటేష్- మహేష్
బాబు నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’,
పవర్ స్టార్-పూరి కాంబినేషన్లో వస్తున్న
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, రవితేజ-పూరి సినిమా ‘దేవుడు
చేసిన మనుషులు’,
రామ్ చరణ్ నటిస్తున్న ‘జంజీర్’, ‘ఎవడు’ లాంటి
పెద్ద హీరోల చిత్రాలపై కూడా
ప్రేక్షకుల్లో భారీగా అంచనాలున్నాయి. అంచనాలను బట్టి ఈ సంవత్సరం
టాలీవుడ్ మరిన్ని హిట్ సినిమాలతో మార్మోగడం
ఖాయంగా కనిపిస్తోంది.
0 comments:
Post a Comment