రవితేజ,
పరుశురాం కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో
హీరోయిన్ గా ఎంపికైన సంగతి
తెలిసిందే. అయితే తనకు డేట్స్
ఎడ్జెస్ట్ కావటం లేదంటూ ఆమె
తప్పుకుంది. తాను రామ్ చరణ్
చిత్రం కోసం ఇరవై రోజుల
పాటు ఫారిన్ వెళ్తున్నానని,కాబట్టి రవితేజ సినిమా చేయటం లేదని ఆమె
తెలియచేసింది. వివి వినాయిక్, రామ్
చరణ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం
ఫారిన్ షూట్ మే 17నుంచి
ప్రారంభం కానుంది.
ఇక అశ్వనీదత్ నిర్మించే రవితేజ చిత్రంలో త్రిషను మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేసారు.
సారొస్తారా అనే టైటిల్ తో
ఈ చిత్రం రూపొందనుంది. యువత, ఆంజనేయులు, సోలో
చిత్రాలు డైరక్ట్ చేసిన పరుసరాం ఈ
చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఇక రవితేజ చిత్రం
కన్నా ముందే ఆమె రామ్
చరణ్ చిత్రం కమిటైంది. అయితే డేట్స్ ఖరారు
కాకపోవటంతో ఆమె రవితేజ చిత్రం
చేస్తానని మాట ఇచ్చింది. అయితే
ఇప్పుడు ఇలా చివరి నిముషంలో
ట్విస్టు ఇవ్వటం ఇబ్బందే అంటున్నారు.
అలాగే
ఆమెను దిల్ రాజు చిత్రం
'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' లో వెంకటేష్ సరసన
అడిగారు. అయితే ఆమె రిజక్టు
చేసింది. ఆమె ఈ విషయమై
మాట్లాడుతూ... నాకు నటించే అవకాశం
వస్తే వదులుకోవటానికి కారణం మహేష్ బాబుకి
వదినగా నటించడం ఇష్టం లేకపోవడం వల్ల
కాదు అంటోంది. ఈ విషయమై చెప్తూ...
నేనూ, దర్శకుడు పరస్పరం చర్చించుకొన్న తరవాతే... ఆ సినిమా నుంచి
తప్పుకొన్నాను. అంతేగానీ వదిన పాత్ర నచ్చక
కాదు. నేను ఇక్కడకు వచ్చింది
నటించడానికే అంది.
హీరోయిన్
అంటే అందాల ఆరబోత అనే
సిద్ధాంతానికి నేను దూరం.. నాలుగు
పాటల్లో కనిపించడానికి నేనే అక్కర్లేదు. అందుకు
చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు.
ఈ రోజుల్లో హీరోయిన్స్ కు నటించే అవకాశం
చాలా తక్కువ. అందుకోసం హీరోయిన్స్ ప్రాధాన్యం ఉన్న కథలపైనే ఆధారపడతారు.
అవి తరచూ రావు కదా.
అందుకే ఏదైనా అవకాశం ఉన్నప్పుడే నటించేయాలి అంది. ఆమె రీసెంట్
గా సిద్దార్ద లవ్ ఫెయిల్యూర్ లో
మోడ్రన్ పార్వతిగా కనిపించి అలరించింది. ఏదైమైనా బెజవాడ ప్లాప్ తర్వాత ఆమె జాగ్రత్తగా అడుగులు
వేస్తోంది. పెద్ద బ్యానర్స్.. పెద్ద
డైరక్టర్స్, హీరోలకు ప్రయారిటీ ఇస్తోంది.
0 comments:
Post a Comment