‘గబ్బర్ సింగ్’
చిత్రం అద్భుతంగా ఉందని,
పవన్ కళ్యాణ్ చాలా బాగా నటించాడంటూ దర్శక రత్న దాసరి నారాయణరావు ప్రశంసల వర్షం కురిపించారు.
దాసరి కోసం ఈ రోజు సినీమాక్స్‌లో స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. సినిమా చూసిన అనంతరం
దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్
ఒంటి చేత్తో సినిమాను నడిపించాడని, దర్శకుడు హరీష్ శంకర్ వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించారని
ప్రశంసించారు. సినిమా ప్రేక్షకులకు మంచి ఉల్లాసాన్ని, ఆనందాన్ని ఇస్తుందని దాసరి చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో దాసరితో పాటు మరో నిర్మాత సి కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్
సరసన శృతి హాసన్ నటించిన ఈ చిత్రంలో మలైకా అరోరా కెవ్వుకేక ఐటం సాంగులో నర్తించింది.
అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు,
రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్,
మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి
ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్
: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్,
ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు
బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్
0 comments:
Post a Comment