జూ ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం "దమ్ము". మొదటి నుంచి భాక్సాఫీస్
వద్ద దమ్ము రేపుతుందంటూ వార్తలు
తెచ్చుకున్న ఈ చిత్రం ఊహించని
విధంగా చతికిల పడింది. కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకున్నా
టాక్ పరంగా చాలా నెగిటివ్
గా మొదటి రోజే తెచ్చుకుంది.
దాంతో ఈ దమ్ము ఎఫెక్టుకి
మహేష్ బాబు... బోయపాటితో చేద్దామనుకున్న ప్రాజెక్టుకు నో చెప్పేసారని టాక్.
దమ్ము
రిలీజ్ కు ముందు బోయపాటి
శ్రీను.. తాను తన తదుపరి
చిత్రాన్ని మహేష్ తో చేస్తున్నట్లు
మీడియా సవేశాల్లో చెప్పుకొచ్చారు. ఆ వార్త చాలా
ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా మంది బోయపాటి
శ్రీను.. మాస్ యాక్షన్ కథలకీ,
మహేష్ సాఫ్ట్ యాక్షన్ స్టోరీలకు ఎక్కడ పొంతన కుదురుతుందనే
సందేహాలు వెల్లబుచ్చారు కూడా. ఈ చర్చ..
చర్చల దశలోనే ఉండగానే దమ్ము విడుదలైంది. మార్నింగ్
షో.. డివైడ్ టాక్ తెచ్చుకుంది. దాంతో
మహేష్ వెంటనే నిర్ణయం మార్చుకుని, బోయపాటితో సినిమాకు ఆసక్తి చూపలేదని తెలిసింది. తర్వాత బోయపాటి.. మహేష్ తో టచ్
లోకి వెళ్దామని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని
ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా.
దాంతో
బోయపాటి శ్రీను వెంటనే.. దుర్గా ఆర్ట్స్ వారితో తన తదుపరి చిత్రం
చేస్తున్నానని, రామ్ చరణ్ హీరోగా
అనే ప్రకటన ఇప్పించారు. అలా దమ్ము రిజల్టు
వెంటనే బోయపాటి కెరీర్ పై చూపింది. మహేష్
ని నిర్ణయం మార్చుకునేలా చేసిందని చెప్పుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ
కామన్ అని, హిట్ రాగానే
ఆ డైరక్టర్ ని పిలిచి అందరు
హీరోలు డేట్స్ ఇస్తారని, ప్లాప్ వస్తే ఫోన్ కూడా
ఎత్తటానికి ఆసక్తి చూపరనేది నిజం. అందుకు ఉదాహరణగా
గబ్బర్ సింగ్ దర్శకుడుని చూపెడుతున్నారు.
గబ్బర్ సింగ్ దర్శకుడు వెనక
మొత్తం ఇండస్ట్రీలోని హీరోలందరూ పడటాన్నీ చూపిస్తున్నారు.
ఇక ప్రస్తుతం మహేష్.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం పూర్తిచేసే బిజీలో ఉన్నారు. వెంకటేష్ తో కలిసి చేస్తున్న
ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా
చేస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్
రాజు నిర్మిస్తున్నారు. మరో ప్రక్క సుకుమార్
దర్శకత్వంలో మరో చిత్రం మొదలైంది.
పాటతో ప్రారంభమైన ఈ చిత్రం ధ్రిల్లర్
అని తెలుస్తోంది.
0 comments:
Post a Comment