హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)
వెంటాడుతోంది! జగన్ ఆస్తుల కేసులో
అతనికి సమన్లు ఇవ్వడానికి సిబిఐ బృందం కర్నూలు
జిల్లాకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. వైయస్ జగన్ ప్రస్తుతం
జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం
నిర్వహిస్తున్నారు. ఆయన ప్రచారంలో బిజీబిజీగా
ఉండటంతో సమన్లను నేరుగా ఆయనకు ఇచ్చేందుకు కర్నూలు
వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఎమ్మిగనూరు
నందవరం మండలంలో జగన్ ఉన్నారు. సిబిఐ
బృందం మరికొద్దిసేపట్లో అక్కడకు చేరుకొని, ఆయనను ప్రత్యేకంగా కలిసి
సమన్లు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
అయితే సిబిఐ బృందం కేవలం
సమన్లు జారీ చేసేందుకే కర్నూలు
వచ్చిందా మరే కారణమైనా ఉందా
అను అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సిబిఐ
జగన్కు సమన్లు ఇవ్వాలనుకుంటే
హైదరాబాదులోని లోటస్ పాండులోని అతని
ఇంట్లో అందజేసే అవకాశముంది. అలాంటప్పుడు కర్నూలు వెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా
అంటున్నారు. దీంతో ప్రత్యేకంగా జగన్కు వ్యక్తిగతంగా సమన్లు
ఇవ్వడానికే వెళ్లారా లేక మరే కారణమైనా
ఉందా అనే కోణంలో చర్చ
జరుగుతోంది. సిబిఐ అధికారులు నిన్న
రాత్రే కర్నూలు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
సమన్లు
అందించడానికి సిబిఐ వస్తున్న విషయం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు శనివారమే తెలిసిందని సమాచారం. అందుకే ఆ పార్టీ నేతలు..
సిబిఐ సమన్లు ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా
ఉన్నామని చెప్పారు. కాగా ఇటీవల సిబిఐ
ప్రత్యేక కోర్టు జగన్, జగతి పబ్లికేషన్స్ వైస్
చైర్మన్ విజయ సాయి రెడ్డి
తదితరులకు సమన్లు జారీ చేసిన విషయం
తెలిసిందే. ఆస్తుల కేసు విషయంలో ఈ
నెల 28వ తేదిన కోర్టుకు
రావాలని ఆదేశించింది.
0 comments:
Post a Comment