హైదరాబాద్:
ముఖ్యమంత్రి ఉపయోగించే హెలికాప్టర్ను కొందరు సిబ్బంది
మిత్రులకు, గర్ల్ ఫ్రెండ్తో
నగర సందర్శనకు ఉపయోగించారన్న కథనంపై సిఎం కిరణ్ కుమార్
రెడ్డి ఆదివారం స్పందించారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం
ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదికి ఆయన
వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా
ముఖ్యమంత్రి హెలికాప్టర్ చాపర్ను కొందరు
సిబ్బంది ఉపయోగించారని వార్తలు వచ్చాయి. దీంతో ఆయన విచారణకు
ఆదేశించారు.
ముఖ్యమంత్రి
ఉపయోగించే అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్లో కొందరు గంటల
తరబడి గగనతలంలో నగర సందర్శనం చేసినట్లుగా
తెలుస్తోంది. హెలికాప్టర్ కెప్టెన్ బరుణ్ గుప్తా స్నేహితుడు,
మరొక టెక్నిషియన్ సాగర్ గర్ల్ ఫ్రెండ్
చాపర్లో విహారం చేశారట.
ఈ హెలికాప్టర్లో చక్కర్లు కొట్టేందుకు
బరుణ్ గుప్తా, సాగర్ చాలా వ్యూహాత్మకంగా
వ్యవహరించారట. పైలట్ బరుణ్ గుప్తా
తన స్నేహితుడి కోసం రూల్స్ బేఖాతరు
చేస్తే, టెక్నీషియన్ సాగర్ తన గర్ల్
ఫ్రెండ్ కోసం ఆయనకు సహకరించాడట.
వీరిద్దరూ
కలిసి తమ వారి కోసం
సిఎం హెలికాప్టర్ను ఉపయోగించుకున్నారట. గ్రౌండ్ క్లియరెన్స్
కోసం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్
(ఎటిసి) అనుమతి కోసం పైలట్, టెక్నీషియన్లు
ఇక్కడే తమ తెలివితేటలు ప్రదర్శించారట.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహణకు సిఎం
హెలికాప్టర్ను ఉపయోగించుకుంటామని డిజిపి
దినేశ్ రెడ్డి ప్రతిపాదనలు పంపగా సిఎం తిరస్కరించారు.
అయితే
ఈ విషయాన్ని దాచిపెట్టి, డిజిపి పర్యటన కోసం ట్రయల్ రన్
చేస్తున్నట్టు పైలట్, టెక్నీషియన్లు చెప్పారట. క్వాలిటీ కంట్రోల్ ఇన్చార్జి వారికి
అనుమతి ఇచ్చారట. డిజిపి పర్యటన కోసం ట్రయల్ రన్
పేరిట హెలికాప్టర్ గాలిలోకి ఎగిరిందని తెలుస్తోంది. ఇందులో పైలట్, ఇంజనీర్, టెక్నీషియన్తో పాటు ఓ
ఫ్రెండూ, గర్ల్ ఫ్రెండూ ఉన్నారట.
హెలికాప్టర్
బయలుదేరే ముందు అందులో ప్రయాణిస్తున్న
వారి వివరాలను లాగ్బుక్లో
నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ పని
ఎవరూ చేయలేదని తెలుస్తోంది. హైసెక్యూరిటీ జోన్లోకి అనుమతిలేకుండా,
అనధికార వ్యక్తులు వచ్చి హాయిగా సిఎం
హెలికాప్టర్లోకి ఎక్కి, హైదరాబాద్,
రంగారెడ్డి జిల్లాల పరిధిలో చక్కర్లు కొట్టారట.
0 comments:
Post a Comment