న్యూఢిల్లీ:
దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ
ఆశయాల మేరకు పార్లమెంటు పని
చేస్తోందని ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్
సోనియా గాంధీ అన్నారు. భారత
పార్లమెంటు అరవయ్యవ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ,
లోకసభలలో సభ్యులు మాట్లాడారు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్యం మనదే
అని సోనియా గాంధీ అన్నారు. ఈ
అరవయ్యేళ్లలో ప్రజాస్వామ్యం మరింత బలపడిందన్నారు. జాతి
నిర్మాతలు నిర్దేశించిన మార్గంలో ప్రజాస్వామ్యం ఉందన్నారు.
దేశ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా
పాలన కొనసాగిస్తాని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. పార్లమెంటరీ
వ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఇరవయ్యొక్క ఏళ్లుగా రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు తాను ఎంతో గర్విస్తున్నానని
చెప్పారు.
భారత
దేశం సంఘటితంగా ఉండి ప్రజాస్వామ్యం ఔన్నత్యాన్ని
కాపాడుతోందని బిజెపి నేత అరుణ్ జైట్లీ
అన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు విచ్చిన్నమయ్యాయని
చెప్పారు. కానీ భారత దేశం
సంఘటితంగా ఉండి ప్రజాస్వామ్యం ప్రపంచానికి
కొత్త సందేశం ఇచ్చిందని చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ వంటి అత్యున్నత
వ్యక్తి ప్రపంచంలో లేడని బిజెపి అగ్రనేత
ఎల్ కె అద్వానీ అన్నారు.
అరవయ్యేళ్లలో భారత్ ఎంతో ఎత్తుకు
ఎదిగిందని చెప్పారు.
దేశంలో
సమస్యల పరిష్కారంలో పార్లమెంటు సఫలీకృతం అయిందని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రపంచంలోనే భారత ప్రజాస్వామ్యానికి ప్రత్యేక
గుర్తింపు ఉందన్నారు. భారత్ ఇంకా సాధించాల్సింది
ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి
తొలితరం సభ్యులను అభినందించారు.
0 comments:
Post a Comment