మహేష్,
త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో అతడు,ఖలేజా చిత్రాలు వచ్చిన
సంగతి తెలిసిందే. అయితే మరోసారి మహేష్
ని త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్నారు. మే 10, మే 11 తేదీల్లో ఈ
షూట్ జరగనుంది. అయితే ఈ షూటింగ్
సినిమా నిమిత్తం కాదు. ఓ యాడ్
ఫిలిం కోసం కావటం విశేషం.
అలూకాస్ జ్యూయలరీ చైన్ ఏడ్ నిమిత్తం
మళ్లీ వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. మహేష్
కి త్రివిక్రమ్ మంచి స్నేహితుడు కావటంతో
ఈ ఆఫర్ త్రివిక్రమ్ ని
వరించింది. గతంలోనూ ఈ బ్రాండ్ కోసం
వీరిద్దరూ కలిసిపని చేసారు.
ఇక మహష్ బాబు నేరుగా
బాలీవుడ్లో ఒక్క సినిమా
చేయకపోయినా.. ఆయన అందమే దేశవ్యాప్త
బ్రాండ్ ప్రమోషన్కు థమ్స్ అప్కు వంటి పెద్ద
బ్రాండ్ కి అవకాశమిచ్చేలా చేసింది.
ఇటీవల దూకుడు, బిజినెస్మేన్లు కమర్షియల్గా సక్సెస్ అవడంతో
ఆయన బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఒక తెలుగు సినిమాకు దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు తేగల
స్టామినా ఉన్న స్టార్ మహేష్
బాబు అని టాలీవుడ్లోనే
కాకుండా బాలీవుడ్లోనూ బాగా టాకొచ్చింది.
దీంతో ఆయన నేషనల్ బ్రాండ్
అంబాసిడర్గా మారిపోయారు.
బ్రాండ్
అంబాసిడర్గా మహేష్ బాబు
యూనివర్సెల్ అనే మొబైల్ హ్యాండ్సెట్ల రిటైల్ విక్రయ
సంస్థ నుంచి ఐటీసీ, ఐడియా
వంటి అతిపెద్ద కంపెనీలకు, కోకకోలా తరఫున థమ్స్అప్కూ ప్రచారం చేస్తున్నాడు.
అమృతాంజన్ వంటి చరిత్రాత్మక బ్రాండ్కు, జాస్ అలుక్కాస్
వంటి నూతనంగా విస్తరిస్తున్న కంపెనీలకూ ఆయనే ఫేవరెట్. ఇటీవల
సంతూర్ యాడ్లోనూ కనిపి
న్నాడు. తెలుగు హీరోల పరంగా... మొత్తం
బ్రాండ్ అంబాసిడర్ల మార్కెట్లో పెద్ద స్టార్
అయిన మహేష్ బాబుకు డజనుకుపైగా
యాడ్స్ చేతిలో ఉన్నాయి.
ఇక మహేష్ సినిమాల విషయానికి
వస్తే ప్రస్తుతం మహేష్ చేతిలో సీతమ్మ
వాకిట్లో సిరిమల్లె చెట్టు,సుకుమార్ చిత్రం ఉన్నాయి. త్వరలో రాజమౌళి కాంబినేషన్ లో చేయటానికి సైన్
చేసారు. మరెన్ని ప్రాజెక్టులు పైప్ లైన్ లో
ఉన్నాయి. మహేష్ గతంలోలాగ కాకుండా
వరసగా సినిమాలు చేసుకుంటూ పోవటం కలిసివస్తోంది. ఇప్పుడు
టాలీవుడ్ లో మినిమం ఏడాదికి
రెండు సినిమాలు చేసే హీరోగా మహేష్
పేరు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.
0 comments:
Post a Comment