తెలుగుదేశం
పార్టీకి ఆగస్టు సంక్షోభం లాగా వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి
మే సంక్షోభం తప్పదనే మాట వినిపిస్తోంది. మండుటెండలు
కుతకుత ఉడికే మే నెలలో
వైయస్ జగన్కు కష్టాలు
తప్పవేమో అనిపిస్తోంది. గతంలో వరంగల్ జిల్లా
మహబూబాబాద్ ఓదార్పు యాత్ర సంఘటనలు మే
నెలలోనే జరిగాయి. ఇప్పుడు ఆస్తుల కేసులో జగన్కు కోర్టు
సమన్లు జారీ చేయడం, ఆయన
మీడియా సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం మే నెలలోనే సంభవించాయి.
గతంలో
తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నప్పటికీ పట్టుబట్టి మహబూబాబాద్ మహబూబాబాద్ ఓదార్పు యాత్రకు వైయస్ జగన్ బయలుదేరారు.
అయితే, ఆయన అక్కడికి చేరుకోలేకపోయారు.
అడుగడుగునా తెలంగాణవాదులు ఆయన ప్రయాణానికి అడ్డు
పడ్డారు. 2010 మే 28వ తేదీన
ఆయన మహబూబాబాద్లో ఓదార్పు యాత్రను
తలపెట్టారు. ఇది హింసాత్మకంగా మారింది.
పరిస్థితి
విషమించడంతో వైయస్ జగన్ ప్రయాణిస్తున్న
రైలు మధ్యలోనే ఆగిపోయింది. పోలీసులు వైయస్ జగన్ను
అదుపులోకి తీసుకున్నారు. దాంతో జగన్ ఓదార్పు
యాత్ర చేపట్టలేకపోయారు. మళ్లీ 2012 మేలో ఆయన గండాలను
ఎదుర్కుంటున్నారు. వైయస్ జగన్ ఆస్తుల
కేసులో సిబిఐ వేగంగా ముందుకు
కదులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ నెల 28వ తేదీ
ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.
మే 28 తేదీన మహబూబాబాద్ పర్యటన
సందర్భంగా పోలీసులు జగన్ను అదుపులోకి
తీసుకోవడం, ఈ నెల 28వ
తేదీన్నే ఆయన కోర్టుకు హాజరు
కావాల్సి రావడం యాదృచ్ఛికమే కావచ్చు
గానీ, చాలా మంది ఈ
రెండు తేదీలకు లింక్ పెట్టి చూస్తున్నారు.
వైయస్ జగన్ను 28వ
తేదీన అరెస్టు చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
0 comments:
Post a Comment