హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మరోసారి తీవ్రంగా ధ్వజమెత్తారు.వరంగల్ జిల్లా పరకాల సీటును వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు
అమ్ముకోవడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. పరకాలలో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు కొండా సురేఖను గెలిపించేందుకు
కెసిఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆయన మంగళవారం మీడియా
ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తెరాస
అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు,
తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి
(తెలంగాణ జెఎసి) మధ్య వాటాల పంపకం
వల్లే విబేధాలు తలెత్తాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ
రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్,
కెసిఆర్ తోడు దొంగలని ఆయన
వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని సోనియా గాంధీకి తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు
దండుకున్న వీరిద్దరికీ వాటాల పంపకం తేలలేదని
ఆయన అన్నారు.
ఉద్యమం
పేరు చెప్పి కెసిఆర్ ఏడు వందల మంది
విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. కోదండరామ్ ఇంతకాలం కెసిఆర్కు ఎందుకు అనుకూలంగా
వ్యవహరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. సోనియాతో చీకటి ఒప్పందమేమిటో చెప్పాలని
ఆయన కెసిఆర్ను డిమాండ్ చేశారు.
కెసిఆర్ను నమ్మి మోసపోవద్దని
ఆయన తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నాయకుడు
స్వామి గౌడ్కు సూచించారు.
ఉద్యమం పేరుతో కెసిఆర్ కోట్ల రూపాయలు దండుకున్నారని
ఆయన ఆరోపించారు.
తన స్వార్థ ప్రయోజనాల కోసం తెరాస ప్రయత్నిస్తోందని
బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ
విమర్శించారు. దీర్ఘకాలిక ఉద్యమ ప్రయోజనాలను తాకట్టు
పెడుతోందని ఆయన మంగళవారం మీడియా
ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఓట్లు, సీట్ల కోసం తెలంగాణ
జెఎసిని తెరాస అప్రతిష్ట పాలు
చేసిందని ఆయన అన్నారు. ఎన్డీయె
ద్వారానే తెలంగాణ సాధ్యమని కెసిఆర్ 2009లో అన్నట్లు ఆయన
గుర్తు చేశారు. మతతత్వాన్ని పెంచి పోషించింది కెసిఆరేనని
ఆయన అన్నారు. జాతీయ పార్టీల ద్వారానే
తెలంగాణ సాధ్యమని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment