హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ
సభ్యుడు ఎం.వి.మైసూరా
రెడ్డి శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి
ఈయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ
కేంద్ర కార్యాలయంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
కాగా
అంతకుముందు మైసూరా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి
సిబిఐ విచారణకు బయలుదేరి వెళ్లే ముందు ఆయన ఇంటికి
వెళ్లిన విషయం తెలిసిందే. జగన్
ఇంటికి వెళ్లి ఆయనతో అల్పాహారం తీసుకున్నారు.
అనంతరం వారు భేటీ అయ్యారు.
జగన్ అరెస్టు ప్రచారం నేపథ్యంలో ఆయన పార్టీలో కీలక
బాధ్యతలు నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి
సన్నిహితుడైన మైసూరా రెడ్డి.. జగన్ పార్టీలో ఆయన
కీ రోల్ పోషించే అవకాశముంది.
జగన్ను మైసూరా రెడ్డి
కలవడంతో టిడిపి ఆయనను పార్టీ నుండి
సస్పెండ్ చేసింది.
పదవులే
పరమావధిగా మైసూరా రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారని టిడిపి క్రమశిక్షణా సంఘం చైర్మన్ గోరంట్ల
బుచ్చయ్య చౌదరి అన్నారు. మైసూరాది
పచ్చి అవకాశవాదం అన్నారు. టిడిపిలో ఆయనకు మంచి ప్రాధాన్యత
ఇచ్చామన్నారు. ఆయనకు ఓసారి రాజ్యసభ
ఇచ్చామని, అయితే అందరికి ప్రాధాన్యత
ఇవ్వాలన్న ఆలోచనతో రెండోసారి ఆయన అడిగినప్పటికీ తాము
ఇవ్వలేదన్నారు. దీంతో ఆయన పదవి
దక్కక పోవడంతో తమ పార్టీకి దూరమయ్యారన్నారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నేతలు చెబుతున్నట్లుగా తాము
కక్ష కట్టి జగన్ పైన
విమర్శలు చేయడం లేదన్నారు. అక్రమాస్తుల
కేసులో జగన్ ఎలాగూ జైలుకు
వెళ్తారని భావించిన మోసూరా రెడ్డి, ఆ తర్వాత తాను
పార్టీలో కీలకంగా ఎదగవచ్చుననే భావనతోనే తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసులో
చేరి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment