ప్రస్తుతం
చేతిలో సినిమాలు ఏవీలేక ఖాలీగా ఉంటున్న హీరో నవదీప్ సిక్స్
ప్యాక్ బాడీ బిల్డ్ చేసే
పనిలో ఉన్నాడు. త్వరలో తను నటించబోయే సినిమా
కోసమే నవదీప్ ఈ కసరత్తులు చేస్తున్నట్లు
స్పష్టం అవుతోంది. ఆ మధ్య మద్యం
సేవించి పోలీసులకు పట్టుబడటమే కాకుండా ఓ గొడవ కేసులో
చిక్కుకున్న ఈ యువ హీరో
చేతిలో పెద్దగా సినిమాలేవీ లేవు. ప్రస్తుతం పొగ
అనే చిత్రంలో నటిస్తున్నాడు.
'ఓయ్’ చిత్రం
దర్శకుడు ఆనంద్రంగా, ‘ఎవరైనా
ఎపుడైనా’ చిత్రం
దర్శకుడు శంకర్ మార్తాండ్ కలిసి
స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘పొగ’.
‘ఫియర్ ఈజ్ ఇన్జ్యూరియస్
టు లైఫ్’ అనేది ఉపశీర్షిక. నవదీప్,
మధుశాలిని, రణధీర్, అర్చన ముఖ్య పాత్రధారులు.
నిర్మాణ దశలో ఉన్న ఈ
సినిమా గురించి ఆనంద్రంగా, శంకర్
మార్తాండ్ మాట్లాడుతూ -‘‘ప్రతి ఒక్కరూ ఏదో
ఒక సందర్భంలో తప్పులు చేస్తాయి. అలాగే ఈ సినిమాలోని
ముఖ్య పాత్రలు కూడా తప్పులు చేస్తారు.
ఆ తప్పుల వల్ల వాళ్లు ఎలాంటి
మూల్యం చెల్లించారు అనేదే మా కథ.
హారర్ జానర్లో సాగే
సినిమా ఇది. వెన్నులో వణుకు
పుట్టించే సన్నివేశాలు ఇందులో ఉంటాయి. ఒకే కథ మా
ఇద్దరి మదిలో మెదలడం యాదృశ్చికం.
అందుకే ఇద్దరం కలిసి తెరకెక్కిస్తే బావుంటుందనే
ఆలోచనతో ‘పొగ’కు శ్రీకారం చుట్టాం.
అంతేకాదు.. మేం అనుకున్నది అనుకున్నట్టు
తెరపై చూసుకోవాలనే భావనతో ఇద్దరం కలిసి సినిమాను నిర్మిస్తున్నాం.
కథలోని
పాత్రలకు తగ్గట్టు నటీనటులు దొరికారు. అంతేకాదు అత్యున్నత సాంకేతిక నైపుణ్యం గల టెక్నీషియన్స్ ఈ
సినిమాకు పనిచేస్తున్నారు. 60 శాతం షూటింగ్ పూర్తయింది.
మిగిలిన భాగాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం. ఈ సినిమాలో విజువల్
గ్రాఫిక్స్కు ఎంతో ప్రాధాన్యత
ఉంది. అన్ని కార్యక్రమాలనూ పూర్తి
చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
0 comments:
Post a Comment