వైజయంతి
మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత
అశ్వనీ దత్ రవితేజ హీరోగా
‘సారొస్తారా’ చిత్రాన్ని
ఓ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పరశురాం
దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో
ప్రారంభం కానుంది. అయితే ఈ లోగా
ఈ చిత్రం టైటిల్ ని ‘సారొచ్చారు’ అంటూ మార్చారు. గతంలో
రవితేజ-పరశురాం కాంబినేషన్లో ‘ఆంజనేయులు’ చిత్రం రూపొందింది. అలాగే ఈ చిత్రంలో
మొదట త్రిష ను అనుకున్నారు
కానీ ఆమె డేట్స్ ఖాళీ
లేకపోవటంతో కాజల్ ని ఎంపిక
చేసారు.
ప్రస్తుతం
రవితేజ నటించిన‘దరువు’ చిత్రం ఈ నెల 25న
విడుదలకు సిద్దంగా ఉంది. శివ(శౌర్యం
ఫేం) దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ గా శ్రీ వెంకటేశ్వర
ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్
గా నటించింది. ఎవరితోనైనా గొడవకు దిగండి. కానీ మాస్తో
పెట్టుకోకండి. వాళ్ల దగ్గర కాస్త
పొగరు ఎక్కువ. ఆనందం వచ్చినా, ఆవేశం
వచ్చినా తీన్మార్ ఆడేస్తారు.
ఆ కుర్రాడూ అంతే. నోటితో పోయేదాన్ని,
చేతి దాకా తెచ్చుకొంటాడు. గొడవకు
దిగడం అంటే మహా సరదా...
అనే కాన్సెప్టుతో 'దరువు' సినిమా రూపొందించారు.
‘దరువు’ చిత్రం
సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని విడుదలకు రంగం సిద్ధం అయిది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ
నెల 25న చిత్రాన్ని గ్రాండ్
గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్
గా నటిస్తోంది. శివ దర్శకత్వం వహించిన
ఈ చిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ శ్రీ వెంకటేశ్వర ఎంటర్
టైన్మెంట్స్ బేనర్ పై నిర్మించారు.
ఈ చిత్రంలో రవితేజ గతంలో ఎన్నడూ లేని
విధంగా సరికొత్తగా కనిపించబోతున్నాడు. పూర్తి మాస్ ఎంటర్టైనర్
గా రూపొందబోతున్న ఈ చిత్రంలో రవితేజ
ఐదు షేడ్స్ విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. గతంలో విక్రమ
హీరోగా వచ్చిన అపరిచితుడు సినిమాలో హీరో మూడు విభిన్నమైన
పార్శ్వాల్లో కనిపిస్తాడు. అదే తరహాలో రవితేజ
ఇందులో ఐదు పార్శ్వాల్లో కనిపించబోతున్నాడని
తెలుస్తోంది. ఇప్పటి వరకు అల్లరి చిల్లర
రౌడీ క్యారెక్టర్లతో కామెడీ హీరోగా కనిపించిన రవితేజ ఈ సినిమాలో తనలోని
అసలైన నటుడిని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.
0 comments:
Post a Comment