మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్
అదుర్స్-2 లో చీఫ్ గెస్ట్గా దర్శనం ఇవ్వబోతున్నాడు.
ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఈ మెగా రియాల్టీ
షోలో ఫైనల్స్ రేపు జరుగనున్నాయి. ఈకార్యక్రమానికి
చెర్రీ ముఖ్య అతిథిగా హాజరైన
పాటిస్పెంట్స్ను ఉత్సాహ పరుచనున్నాడు.
చెర్రీతో పాటు నాగబాబు కూడా
ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాడు. రేపు రాత్రి 9.30 గంటలకు
ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది.
తెలుగు
బుల్లితెరపై ప్రసారం అవుతున్న ప్రముఖ రియాల్టీ షోలలో ‘అదుర్స్ -2’ కార్యక్రమం ఒకటి. ఇందులో పాల్గొనే
వారు సాధారణ జనాలు చేయలేదేని, ఉత్కంఠ
భరితమైన ఫీట్స్, స్టంట్స్ ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటారు. మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ
ఈ కార్యక్రమాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.
ప్రస్తుతం
రామ్ చరణ్ తేజ్ ‘జంజీర్’ అనే
బాలీవుడ్ చిత్రంతో పాటు...తెలుగులో వంశీపైడిపల్లి దర్శకత్వంలో ‘ఎవడు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రాల తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో
ఓ మెగా సినిమాకు కమిట్
అయ్యాడు. ఇందులో చెర్రీ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక చెర్రీ మ్యారేజ్ విషయానికొస్తే జూన్ 14న చరణ్-ఉపాసన
మూడు ముళ్ల ద్వారా ఏకం
కాబోతున్నారు. ఇప్పటికే శుభలేఖల డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రారంభం అయ్యాయి.
మోయినాబాద్లోని ఉపాసన ఫాం
హౌజ్లో వీరి వివాహం
అంగరంగ వైభవంగా జరుగబోతోంది.
0 comments:
Post a Comment