హైదరాబాద్:
కాంగ్రెస్, తెలుగుదేశం, సీబీఐ కుమ్మక్కై తన
అరెస్టుకు కుట్ర పన్నుతున్నాయని వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రధాని
మన్మోహన్కు మంగళవారం రాత్రి
లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం
చేసుకుని, ఈ కుట్రను ఆపాలని
కోరారు. తనను అరెస్టు చేసేలా
జరుగుతున్న కుట్రలో గవర్నర్ నరసింహన్ కూడా భాగస్వామిని చేశారని,
ఉప ఎన్నికలను వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన అరెస్టు తర్వాత
భారీ విధ్వంసానికి పాల్పడి దాని తానే కారణమని
చెప్పేందుకు కుట్ర పన్నారని తెలిపారు.
ఈ లేఖలోని అంశాలను పీటీఐ, ఇతర వార్తా సంస్థలు
రాత్రి పొద్దుపోయాక బయటపెట్టాయి. 'అల్లర్లు సృష్టించి... అవే అల్లర్లను నెపంగా
చూపి... ఉప ఎన్నికలను వాయిదా
వేయాల్సిందిగా గవర్నర్ను కోరనున్నారు. నిస్సిగ్గుగా
జరుగుతున్న ఈ కుట్రను, అప్రజాస్వామిక
ప్రయత్నాలను నిలువరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను' అని మన్మోహన్కు
జగన్ విన్నవించుకున్నారు.
ఇదే తరహా లేఖను కేంద్ర
ఎన్నికల కమిషనర్ ఖురేషీకి కూడా జగన్ పంపించారు.
"ఇది నిరాధార ఆరోపణ కాదు. ఈ
కుట్ర ఇక్కడ జరిగింది? ఇందులో
ఎవరెవరు భాగస్వాములయ్యారు? అనే అంశాలపై నాకు
విశ్వసనీయ సమాచారం ఉంది. కాంగ్రెస్ సీనియర్
నేత వయలార్ రవి గత వారం
ముఖ్యమంత్రి కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సీబీఐ జాయింట్ డైరెక్టర్
లక్ష్మీనారాయణ, డీజీపీ దినేశ్ రెడ్డిలతో రహస్య భేటీ జరిపారు''
అని జగన్ తన లేఖలో
పేర్కొన్నారు.
తాను
సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్న సందర్భంగాఈనెల
28న హైదరాబాద్లో 'సీన్ క్రియేట్'
చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని కూడా తెలిపారు. 27వ
తేదీ అర్ధరాత్రి నుంచి హైదరాబాద్కు
దారితీసే రహదారులను దిగ్బంధించాలని డీజీపీ కార్యాలయం రహస్య సర్క్యులర్ జారీ
చేసిందన్నారు.
0 comments:
Post a Comment