గబ్బర్
సింగ్,దబాంగ్ చిత్రాలు రెండింటికి ఒకే బ్యాక్ గ్రౌండ్.
అయితే గబ్బర్ సింగ్..దబాంగ్ కి కాపీ..పేస్ట్
కాదు. ఏ సినిమా ఇంపార్టెన్స్..ఆ సినిమాదే. నేను
ఈ రెండు సినిమాలుకూ ఒకే
రేటింగ్ ఇస్తాను అన్నారు అభిమన్యు సింగ్. గబ్బర్ సింగ్ చిత్రంలో విలన్
గా చేసిన ఈయన రీసెంట్
గా వన్ ఇండియాకు ప్రత్యేకంగా
ఇంటర్వూ ఇచ్చారు. అందులో భాగంగా మీరు దబాంగ్,గబ్బర్
సింగ్ చిత్రాలు రెండింటిలో దేనికి ఎక్కువ రేటింగ్ ఇస్తారు అంటు ఇలా స్పందించారు.
అలాగే
పవన్ కళ్యాణ్,శృతి హాసన్ తో
తన వర్కింగ్ ఎక్సపీరియన్స్ పంచుకుంటూ...వారిద్దరితో పనిచేసిన ఎక్సపీరియన్స్ వండ్రఫుల్. పవన్ కళ్యాణ్ సార్
నుంచి నేను చాలా నేర్చుకున్నాను.
గబ్బర్ సింగ్ లో పనిచేయటం
నా అదృష్టం. పవన్ లాంటి పెద్ద
స్టార్ కూడా అంత గౌరవంగా,కామ్ గా ఉండటం
నన్ను ఆశ్చర్యపరిచింది. శృతి కూడా చాలా
బాగా చేసింది అన్నారు.
ఇక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి,
బాలీవుడ్ లో రెండింటిలో మీరు
సక్సెస్ సాధించారు కదా...ఏమిటి తేడా
కనిపించింది అంటే..రెండు విభిన్నమైన
పరిశ్రమలు. రెండింటిని పోల్చలేం. అయితే రెండు చోట్లా
సినిమా అంటే ఒకే రకమైన
ఫ్యాశన్ ఉన్న వ్యక్తలు ఉండటం
గమనించాను. అందుకేనేమో నాకు పర్శనల్ గా
బాలీవుడ్ సినిమా అయినా సౌత్ సినిమా
అయినా పెద్ద తేడా అనిపించదు
అన్నారు.
ఇక తన వ్యూచర్ ప్రాజెక్టుల
గురించి చెపుతూ...అబ్ తక్ చప్పన్
సీక్వెల్ మాత్రమే ఖరారు అయ్యింది. మిగతా
ప్రాజెక్టుల ప్రస్తుతం టాక్స్ దశలో ఉన్నాయి. ఆ
దర్శక,నిర్మాతలు వాటి గురించి చెపుతారు.
ఈ దశలో నేను వాటి
గురించి మాట్లాడకూడదు అన్నారు. అభిమన్యు సింగ్ కి తెలుగులో
వరసగా ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. పెద్ద హీరోలు తమ
చిత్రాల్లో నెగిటివ్ పాత్రలకు అభిమన్యు సింగ్ ని ప్రిఫర్
చేస్తున్నారు.
0 comments:
Post a Comment