పవన్
కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన హిట్
చిత్రం ‘జల్సా’.
ఈ చిత్రానికి వీరాభిమానని అంటున్నారు అల్లు అర్జున్. ఆయన
మీడియాతో మాట్లాడుతూ... త్రివిక్రమ్ చేసిన ‘జల్సా’ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. అంత ఇష్టం
ఆ సినిమా అంటే. అలాంటి సినిమా
ఇచ్చిన త్రివిక్రమ్ డెరైక్షన్లో చేయడం లక్కీగా
ఫీలవుతున్నాను అన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘జులాయి’చిత్రం
చేస్తున్నారు.
‘జులాయి’గురించి
చెపుతూ అల్లు అర్జున్...‘జులాయి’ చిత్రం
ఓ వెండితెర విందు. దేవిశ్రీప్రసాద్ మళ్లీ నా సినిమాకు
మ్యూజిక్ ఇవ్వడం, ఇలియానాతో తొలిసారి నటించడం ఆనందంగా ఉంది‘జులాయి’లో డైలాగ్స్కి
విజిల్స్ పడతాయి’’ అని అన్నారు. డీవీవీ
దానయ్య సమర్పణలో ఎన్.రాధాకృష్ణ ఈ
చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పనీపాటా
లేకుండా జులాయిగా తిరగాలంటే ఎంత కష్టపడాలో తెలుసా?
ఒకటో కష్టం... మనకు పనికొచ్చే పనులేమీ
పెట్టుకోకూడదు. రెండు - ఇంట్లోవాళ్లు ఎన్ని తిట్టినా అవన్నీ
దీవెనల్లా స్వీకరించాలి. మూడు - చదువు, సంధ్యా అబ్బేస్తున్నా వాటికి దూరంగా ఉండాలి. ఆరు... లేనిపోని గొడవల్లో తలదూర్చాలి. పది... దెబ్బలాటకు సై అనాలి. అమ్మో...
వీటికన్నా బుద్ధిమంతుడు అనే పేరు తెచ్చుకోవడమే
సులువు. కానీ 'జులాయి' అనే
పిలుపులో వచ్చే కిక్కు వాటిలో
ఉండదు. ఆ అబ్బాయి కూడా
అచ్చం ఇలానే అనుకొన్నాడు. ఆ
పేరుకి సార్థకత తెచ్చిపెట్టే సాహసాలు చేశాడు. అవేంటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి
అంటున్నారు నిర్మాత ఎస్.రాధాకృష్ణ.
ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'జులాయి'. అల్లుఅర్జున్, ఇలియానా జంటగా నటిస్తున్నారు. త్రివిక్రమ్
దర్శకత్వం వహిస్తున్నారు. రెండు పాటలు మినహా
చిత్రీకరణ పూర్తయింది. జూన్ మొదటి వారంలో
పాటల్ని విడుదల చేస్తారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ
''త్రివిక్రమ్ పండించే వినోదం చాలా బాగుంటుంది. అందరికీ
నచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే నెల చివరి
వారంలో చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది''న్నారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్,
సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు.
సమర్పణ: డి.వి.వి.దానయ్య,సంగీతం: దేవిశ్రీప్రసాద్.
0 comments:
Post a Comment