కర్నూలు:
ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మార్పు అనేది అవాస్తవమని ప్రదేశ్
కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం
అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో
భాగంగా ఆయన కర్నూలు జిల్లాకు
వచ్చారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో
కుమ్మక్కై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.
దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
వ్యతిరేకి అయిన చంద్రబాబుతో జగన్
కుమ్మక్కు కావడం దురదృష్టకరమన్నారు. జగన్ తీరు
ఆడలేక మద్దెల ఓడు అన్న విధంగా
ఉందన్నారు. రైతుల కోసమే తన
వర్గం నేతలు రాజీనామా చేశారని
వైయస్ జగన్ చెప్పడం విడ్డూరంగా
ఉందని కౌంటర్ వేశారు. వారు రాజీనామా చేసింది
రైతులు, పేదల కోసం కాదన్నారు.
కాగా అంతకుముందు రోజు ప్రకాశం జిల్లా
ఒంగోలులో బొత్స ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అభ్యర్థులను
ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ ప్రకటిస్తారని, వారికి
పిసిసి అధ్యక్షునిగా తాను బి- ఫారాలు
ఇస్తానని, ఉప ఎన్నికల్లో ఫలితాలకు
తాను బాధ్యత వహిస్తానని చెప్పారు. తాను బి-ఫారాలు
ఇచ్చి మరొకరిని బాధ్యత తీసుకోమంటే ఎలా అని ప్రశ్నించారు.
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం పర్యటించిన బొత్స సాయంత్రం స్థానిక
ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో ఫలితాలు
కాంగ్రెస్కు మెరుగ్గా ఉంటాయని
చెప్పిన ఆయన, ఈ ఎన్నికలను
ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా మాత్రం భావించడానికి వీల్లేదన్నారు.
294 స్థానాలున్న
రాష్ట్రంలో 10% స్థానాలకు కూడా ఉప ఎన్నికలు
జరగనప్పుడు వాటి ఫలితాలను రెఫరెండంగా
ఎలా భావిస్తామని ప్రశ్నించారు. ప్రభుత్వం, పిసిసి సమన్వయంతో నడుస్తున్నాయని, అయినా బి-ఫారాలు
ఇచ్చేది తానే కాబట్టి ఫలితాల
బాధ్యత తానే తీసుకుంటానని స్పష్టం
చేశారు. ఈ ఉప ఎన్నికల్లో
ప్రధాన పోటీ కాంగ్రెస్, వైఎస్సార్సీపీల మధ్యేనని, టిడిపికి
మూడో స్థానమేనని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
కాంగ్రెస్
ముఖ్యమంత్రిగా వైఎస్ చేపట్టిన ఏ పథకమూ ఆగిపోలేదని,
మరిన్ని నిధులతో మరింత మెరుగ్గా అమలవుతున్నాయని
చెప్పారు. జగతి పబ్లికేషన్స్ విషయంలో
సీబీఐ తన పని తాను
చేస్తోంది తప్ప.. దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
పత్రికా స్వేచ్ఛ అంటే ఒక్క జగన్
మీడియాకేనా.. ఇతర పత్రికలకు అవసరం
లేదా అని ప్రశ్నించారు.
0 comments:
Post a Comment