రాష్ట్రంలో
ప్రస్తుతం సంచలనాత్మకంగా సాగుతున్న సిబిఐ దర్యాప్తు
గురించి మీకు తెలిసే ఉంటుంది.
సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాడు. ఇప్పటికే అనేక మంది అవినీతి
అధికారులు అరెస్టవ్వగా....అధికార దుర్వినియోగంతో కోట్లు సంపాదించిన మరికొందరు రాజకీయ నాయకులు అరెస్టు అవవడానికి సిద్దంగా ఉన్నారు.
తాజాగా
సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల
ప్రకారం...క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సిబిఐ
జాయింట్ డైరెక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుంతం క్రిష్ ‘కృష్ణం వందే జగద్గురుమ్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
ఈచిత్రంలో పవర్ స్టార్ సీబీఐ
జెడీగా గెస్ట్ రోల్ చేయనున్నారని, ఇటీవల
క్రిష్ అతన్ని కలిసి ఈ పాత్ర
చేయడానికి ఒప్పించాడని చర్చించుకుంటున్నారు. మైనింగ్ మాఫియా నేపథ్యం కూడా ఈచిత్రంలో ఉంటుందట.
ఈ చిత్రంలో రాణా హీరోగా నటిస్తున్నాడు.
రాణా బిటెక్ బాబుగా కనిపించనున్నాడు. అతని పేరు బాబు.
చదివింది బీటెక్. అందుకే అన్నీ హైటెక్ తెలివి
తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. రాణా సరసన నయనతార
హీరోయిన్ గా చేస్తోంది. నయనతార
పాత్ర పేరు దేవిక. ఆమె
డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో
కీలకమై నడుస్తుంది.
గతంలో
పవర్ స్టార్ అన్నయ్య చిరంజీవి సినిమాల్లో తప్ప మరే సినిమాలోనూ
గెస్ట్ రోల్ చేయలేదు. తొలి
సారిగా ఆయన బయటి వారి
సినిమాలో అతిథి పాత్ర చేస్తుండటం
ఆసక్తి కరంగా మారింది. ఈ
విషయమై ఇంకా అఫీషియల్ స్టేట్
మెంట్ వెలువడాల్సి ఉంది.
0 comments:
Post a Comment