బరువు
తగ్గాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా? అధికంగా వ్యాయామాలు చేయకుండా మీ బరువును తగ్గించే
కొన్ని సహజ పానీయాలను చూడండి.
ఈ పానీయాలు పండ్లు, కూరగాయల వంటి వాటితో తయారు
చేయబడి తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. పోషక
విలువలు అధికం. ఈ రకంగా పండ్లు
కూరలను మన ఆహారంలో చేర్చుకుంటే,
కేన్సర్, పక్షవాతం, కిడ్నీ రాళ్ళు, గుండె జబ్బులు, డయాబెటీస్,
కొల్లెస్టరాల్, ఇంకా ఇతర వ్యాధులు
కూడా రాకుండా వుంటాయి. కొద్దిపాటి ఆహార మార్పులు, మీ
ఆహారంలో బరువు తగ్గించే పానీయాలు
మిమ్మల్ని ఎంతో సన్నపడేసి, ఆరోగ్యంగా
వుంచుతాయి.
బరువు
తగ్గించే సహజ పానీయాలు
సొరకాయ
రసం - సొరకాయ రసంలో నీరు, పీచు
పుష్కలంగా వుంటాయి. 100 గ్రాముల రసంలో 12 కేలరీల శక్తి వుంటుంది. ప్రతిరోజూ
మీ బ్రేక్ ఫాస్ట్ లో ఒక్క గ్లాసెడు
సొర రసం చేర్చండి. ఎన్నో
ఆరోగ్య ప్రయోజనాలివ్వటమే కాక, మీ చర్మానికి
కాంతి కూడా ఇస్తుంది. మన
ఆకలిని మందగించి అధిక ఆహారం తీసుకోకుండా
చేస్తుంది కనుక బరువు తగ్గేందుకు
సొర రసం బాగా పనిచేస్తుంది.
పుచ్చ
పండు రసం - పుచ్చకాయలో విటమిన్లు,
మినరల్స్ అధికం. 100 గ్రాముల రసంలో 30 కేలరీల శక్తి వుంటుంది. జాతీయ
వాటర్ మెలన్ ప్రమోషన్ బోర్డు
ప్రతినిధి సామంత మేరకు వాటర్
మెలన్ లేదా పుచ్చకాయలో అన్నిరకాల
విటమిన్లు వుంటాయి. గుండె ఆరోగ్యానికి పుచ్చకాయ
ఎంతో మేలని అమెరికనన్ హార్ట్
అసోసియేషన్ తన జాబితాలో చేర్చింది.
ఆరెంజ్
జ్యూస్ - తక్కువ కేలరీలు, అధిక పోషకాలు కల
ఈ పానీయం బరువు తగ్గేందుకు బాగా
పనిచేస్తుంది. 100 గ్రాముల జ్యూస్ లో 47 కేలరీల శక్తి
వుంటుంది. శరీరానికి విటమిన్ సి అందించి కడుపు
నింపుతుంది. సిట్రస్ జాతి పండ్లు శరీరంలో
అధిక కొవ్వు కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి.
కేరట్
జ్యూస్ - కేరట్ జ్యూస్ లో
కేలరీలు తక్కువ. చాలామంది డైటర్లు ప్రతి రోజూ బరువు
తగ్గేందుకు తమ చర్మ కాంతికి
ఈ పానీయం తాగుతారు. 100 గ్రాముల రసంలో 41 కేలరీల శక్తి వుంటుంది. బాగా
కడుపు నింపేస్తుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్
మరియు ప్రివెన్షన్ సంస్ధ లోని సైంటిస్టులు
ప్రతిరోజూ ఒక గ్లాసు కేరట్
రసం తాగితే రోగ నిరోధకతను బలపరుస్తుందని
తెలుపుతారు.
ద్రాక్ష
రసం - ఇది మరొక బరువు
తగ్గించే పానీయం. సిట్రస్ జాతికి చెందినదే. యాంటీ ఆక్సిడెంట్లు అధికం.
శరీర కొవ్వును తేలికగా కరిగిస్తుంది. వంద గ్రాముల రసంలో
69 కేలరీల శక్తి వుంటుంది. మలబద్ధకం
పోవాలంటే ద్రాక్షరసం తాగాలి. అజీర్ణం, అలసట, కిడ్నీ సమస్యలు,
తలనొప్పి, మహిళలలో రుతుక్రమ సమస్యలకు, గుండె జబ్బులు, ఆస్తమా
వ్యాధులకు ద్రాక్షరసం తాగటం మంచి పరిష్కారం.
బరువు
తగ్గించే ఈ పానీయాలు, ఆరోగ్యం
మరియు త్వరగా జీర్ణం అవుతాయి. కనుక చల్లని తక్కువ
కేలరీలు కల ఈ పండ్లు,
కూరల రసాలను తాగి ఇంటివద్దే మీ
బరువు తగ్గే ప్రణాళిక ఆచరించండి.
0 comments:
Post a Comment