గుంటూరు/హైదరాబాద్: తనను రేపే అరెస్టు
చేస్తారట అని వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు.
ఆయన గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో అన్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడని ఆయన
అన్నారు. తనను అరెస్టు చేస్తే
ఉద్రేకంలో అల్లర్లకు పాల్పడవద్దని ఆయన పార్టీ కార్యకర్తలను,
అభిమానులను కోరారు. సంయమనం పాటించాలని ఆయన సూచించారు. అధికార
కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి తనపై కుట్ర చేస్తున్నాయని
ఆయన విమర్శించారు.
రేపు
తనకు ఏం జరుగుతుందో తెలియదని,
ఏం జరిగినా సంయమనం పాటించాలని ఆయన అన్నారు. తన
వాళ్లకు పదవులు తృణప్రాయమని ఆయన అన్నారు. నిజాయితీయే
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల నినాదమని ఆయన అన్నారు. పేదవాడి
కోసం వారు పదవులు వదిలేశారని
ఆయన అన్నారు. ఆయన జాతీయ మీడియాతో
కూడా మాట్లాడారు
ఎవరికి
ఓటు వేయాలో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. తనకు
అనుకూలంగా చేయాలని తాను ఎవరినీ అడగలేదని
ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో
నిజం లేదని ఆయన అన్నారు.
ప్రభుత్వం తనను ఏ విధంగా
వేధిస్తోందో ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయంగా
తనను ఏకాకిని చేయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి తనపై సిబిఐ చేత
తప్పుడు కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు.
తాను
రాసిన లేఖకు ప్రధాని మన్మోహన్
సింగ్ సమాధానం ఇవ్వకపోవడంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
తనకు అపారమైన ప్రజా మద్దతు ఉందని
ఆయన చెప్పారు. జూన్ 12వ తేదీన ఏ
విధమైన ఆటంకాలు లేకుండా ఉప ఎన్నికలు జరగడం
తమకు కావాలని ఆయన అన్నారు. షెడ్యూల్
ప్రకారం ఉప ఎన్నికలు జరగకపోతే
నష్టపోయేది తమ పార్టీయేనని ఆయన
అన్నారు. ఎన్నికలు జరిగితే తనకు ఎంతగా మద్దతు
ఉందో తెలిసిపోతుందని ఆయన అన్నారు. వైయస్సార్
కాంగ్రెసు పార్టీ గెలుస్తుందనే భయంతోనే కాంగ్రెసు తనపై కక్ష కట్టిందని
ఆయన అన్నారు. తనపై సిబిఐ చేత
తప్పుడు కేసు పెట్టించారని ఆయన
ఆరోపించారు.
కాగా,
జగన్ తీరుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
తీవ్రంగా మండిపడ్డారు. తాము చెప్పినప్పుడే చర్యలు
తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత
జరిగి ఉండేది కాదని ఆయన హైదరాబాదులో
మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ కుమ్మక్కయ్యాయని జగన్ అనడాన్ని ఆయన
తీవ్రంగా తప్పు పట్టారు. డిఎంకె
నేతలు రాజా, కనిమొళి అరెస్టుకు
కూడా తాము కుమ్మక్కయ్యామా అని
ఆయన అడిగారు
చట్టం
ముందు అందరూ ఒక్కటేనని, చట్టానికి
ఎవరూ అతీతులు కారని, తప్పులు చేసినప్పుడు చట్టానికి లోబడి ఉండాలని ఆయన
అన్నారు. ఇతరులపై ఆరోపణలు చేయడాన్ని జగన్ మానుకోవాలని ఆయన
అన్నారు. జగన్ ఇష్ట ప్రకారం
చేశారని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంటే చూస్తూ ఇంట్లో కూర్చోవాలా అని ఆయన అన్నారు.
విధి లేని స్థితిలోనే సిబిఐ
మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేసిందని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment