పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ గన్స్
అంటే అమితంగా ఇష్టపడతారనే విషయం తెలిసిందే. బద్రి
సినిమాప్పటి నుంచి దాదాపు ప్రతి
సినిమాలోనూ తప్పకుండా పవన్ గన్ వాడుతున్నాడు.
గన్ వాడే అవసరం లేకున్నా
వాటిని వాటకం కోసమే ప్రత్యేకంగా
సీన్లు రాయిస్తాడని ఆయనతో కలిసి పని
చేసిన వారు అంటుంటారు.
పవర్
స్టార్ వద్ద అప్పట్లో ఖరీదైన
రివాల్వర్ ఉండేది. అయితే ఆ మధ్య
చిరంజీవి కూతురు శ్రీజ విషయంలో చోటు
చేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో పవర్ స్టార్ తన
ఆయుధాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాడు. అప్పటి నుంచి సినిమాల్లోనే గన్స్పై తన మోజు
తీర్చుకుంటున్నాడు.
గబ్బర్
సింగ్ చిత్రంలో ఫుల్ ఫ్లెడ్జ్గా
పవర్ స్టార్ తన కోరిక తీర్చుకున్నాడని
చెప్పొచ్చు. సినిమా మొదలను నుంచి ఎండింగ్ వరకు
పవర్ స్టార్ చేతిలో గన్ ఉండేలా చేశాడు
దర్శకుడు హరీశ్ శంకర్. తనకు
ఇష్టమైన గన్స్ను చిట్టి
తల్లి, మహాలక్ష్మి అని పిలుచుకుంటాడు కూడా.
దీన్ని బట్టి పవర్ స్టార్కు గన్స్పై
ఎంత లవ్వుందో అర్థం చేసుకోవచ్చు.
పవన్
కళ్యాణ్ సరసన శృతి హాసన్,
మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని,
బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు,
రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్,
ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్,
మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల
ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఫోటో
గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం
: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం
రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న
సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్
కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ
: శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే,
మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్
0 comments:
Post a Comment