కింగ్
నాగార్జున నటిస్తున్న ‘డమరుకం’ చిత్రంతో పాటు... యంగ్ రెబల్ స్టార్
ప్రభాస్ నటిస్తున్న ‘రెబెల్’ చిత్రాలు ఎప్పటి నుంచో చిత్రీకరణ జరుపుకుంటూ
ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి నెలకొన్న
నేపథ్యంలో ఈచిత్రాలపై ఫిల్మ్ నగర్లో రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి.
డమరుకం
చిత్రానికి సంబంధించి ఇంకా కొంత గ్రాఫిక్స్
వర్క్ పూర్తి కావాల్సి ఉందని, అదే విధంగా నాగార్జునకి,
చిత్ర నిర్మాణ సంస్థ ఆర్ ఆర్
మూవీ మేకర్స్కు మధ్య కమ్యూనికేషన్
గ్యాప్ ఉండటం కూడా ఈ
ఆలస్యానికి కారణం అంటున్నారు. అందువల్లనే
సినిమా డిలే అవుతూ వస్తుందనే
వాదన వినిపిస్తోంది. అన్ని సర్దుకుని సినిమా
ప్రేక్షకుల ముందుకు రావాలంటే జులై నేల వరకే
ఆగాల్సిందే అని చిత్ర యూనిట్
సభ్యుల నుంచి వినిపిస్తున్న టాక్.
అదే విధంగా యంగ్ రెబెల్ స్టార్
ప్రభాస్ నటిస్తున్న ‘ రెబెల్’ చిత్రం కూడా పూర్తి కాలేదు.
దర్శకుడు లారెన్స్ స్వార్థపూరిత వ్యవహారమే సినిమా ఆలస్యానికి ప్రధాన కారణమని, సినిమాను ఆలస్యం చేస్తూ ప్రభాస్ కెరీర్తో లారెన్స్ ఆడుకుంటున్నాడని,
ఎంతో విలువైన ప్రభాస్ సమయాన్ని వృధా చేస్తున్నారని అభిమానులు
మండి పడుతున్నారు. ప్రభాస్ సరసన తమన్నా, దీక్షా
సేథ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని జె.
భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈచిత్రం కూడా జులై నెల
నాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
నాగార్జున
ప్రస్తుతం ‘షిరిడి సాయి’ చిత్రంలో నటిస్తున్నారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వం
వహిస్తున్న ఈ చిత్రంలో నాగ్
సాయిబాబా పాత్రలో కనిపిస్తున్నారు. రెబల్ మరో వైపు
కొరటాల శివ దర్శకత్వంలో ‘వారధి’ చిత్రంలో
నటిస్తున్నాడు.
0 comments:
Post a Comment