నాకు
సిక్స్ ప్యాక్ లేదు...ట్రై చేసాను కానీ..ప్రకృతి సహకరించలేదు..దాంతో ఉన్న సింగిల్
ప్యాక్ తోటే సినిమా చేసాను
అంటున్నారు పవన్ కళ్యాణ్. దబాంగ్
రీమేక్ గా రూపొందిన గబ్బర్
సింగ్ చిత్రంలో పవన్ ..సిక్స్ ప్యాక్ తో కనపడతారేనని చాలా
మంది ఎక్సపెక్ట్ చేసారు. ముఖ్యంగ క్లైమాక్స్ ఫైట్..దబాంగ్ కి
హైలెట్ గా నిలిచింది. అందులో
సల్మాన్ తన చొక్కా విప్పతీసి
సిక్స్ ప్యాక్ బాడీ చూపుతూ విలన్
తో ఫైట్ చేస్తాడు. అయితే
ఇక్కడ తెలుగులో పవన్ తన బాడీ
లాంగ్వైజ్ తో సినిమాని లాక్కొచ్చేసాడు.
క్లైమాక్స్ ని మార్చి హిట్
కొట్టారు. అందులోనూ రీసెంట్ గా పూల రంగడు
క్లైమాక్స్ లో దబాంగ్ తరహాలో
సునీల్ చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపుతూ ఫైట్ చేయటంతో గబ్బర్
సింగ్ కి అనవసరమనుకున్నట్లు తెలుస్తోంది.
ఇక గబ్బర్ సింగ్ ప్రస్తుతం రికార్డు
కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ
సినిమాని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా చాలా హ్యాపీగా
ఉన్నారు. సిక్స్ ప్యాక్ లేని సల్మాన్ ఖాన్
ని ఎలా ఊహించలేమో...తనదైన
మ్యానరిజమ్స్,బాడీ లాంగ్వేజ్ చూపని
పవన్ ని ఊహించలేం అని
చెప్తున్నారు. అందుకే ఆయన గత సినిమాలు
భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్
కాలేదంటున్నారు. ఇప్పుడు హరీష్ శంకర్..పవన్
ని ఆయన అభిమానులు ఎలా
చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో అలా ప్రెజెంట్ చేసి
హిట్ కొట్టడం జరగింది.
అలాగే
గబ్బర్ సింగ్ హైలెట్స్ లో
డైలాగులు ప్రధాన పాత్ర వహించాయి. హరీష్
శంకర్ ప్రత్యేక శ్రద్దతో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ..ఫన్ ని మిళితం
చేస్తూ రాసిన డైలాగులు అందరికీ
ఆనందం కలిగిస్తున్నాయి. అందుకే గబ్బర్ సింగ్ విడుదలైన మార్నింగ్
షో కే హిట్ టాక్
తెచ్చుకోగలిగింది. మరో ప్రక్క దేవిశ్రీ
ప్రసాద్ సంగీతం సైతం గబ్బర్ సింగ్
కు పూర్తిగా ప్లస్ అయ్యింది. బ్రహ్మానందం,అలీ వంటి కమిడియన్స్
ఉన్నా పవన్ చేసే కామిడీ
ముందు వారు తేలిపోయారంటున్నారు.
సినిమాకి
రిపీట్ ఆడియన్స్ రావటంతో ఈ సినిమా ఇంత
సక్సెస్ కి కారణమంటున్నారు. రిపీట్
ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది..సెకండాఫ్ లో వచ్చే అంత్యాక్షరి
ఎపిసోడ్. అలాగే కెవ్వు కేక
సాంగ్. కెవ్వు కేక సాంగ్ తెరపై
ఊహించనంతగా పేలలేదని అంటున్నా దానికోసం ప్రత్యేకంగా ధియోటర్ కి వెళ్లి చూసివస్తున్న
అభిమానులు ఉంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత
అంటే ఖుషీ తర్వాత పదేళ్ళకు
గానీ ఈ రేంజి హిట్
పవన్ కి పడలేదంటున్నారు.
0 comments:
Post a Comment