నటుడు,రచయిత పోసాని కృష్ణ
మురళి..చిరంజీవిపై పేరు ఎత్తకుండా డైరక్ట్
ఎటాక్ చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఓ మహానుభావుడి బంధువుల ఇంట్లో 35 కోట్ల రూపాయల నెట్
క్యాష్ నల్లడబ్బు రూపంలో దొరికింది. అది లెక్కల్లో లేని
డబ్బు అని కూడా తేలింది.
ఆ ఇంటి పెద్దలపై ఇంతవరకూ
చర్యల్లేవు అని అన్నారు. గతంలోగానే
మరోసారి ఆయన పీఆర్పీపై విమర్శలు
వర్షం కురిపించారు.
అలాగే
అదే డబ్బు వైఎస్ జగన్
ఇంట్లో దొరికి ఉంటే నిమిషాల్లో అరెస్ట్
చేసి జైల్లో పెట్టేవారు. పత్రికలు ఫ్రంట్ పేజీలో జగన్ మీద హెడ్డింగులు
పెట్టేవి. ఇది ఏ తరహా
ప్రజాస్వామ్యమో, ఎంత గొప్ప పత్రికాస్వామ్యమో
భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రరాష్ట్రంలోని ప్రజలు
గమనిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో నిన్నే
జగన్ వెంట ప్రజలున్నారు. వచ్చే
ఎన్నికల్లో ఆంధ్రా ఒక్కటే కాదు, ఢిల్లీ పీఠంపై
కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కొన్నేళ్లలోనే... కాదు కాదు.. కొన్నాళ్లలోనే
కూర్చుంటారు. గాడ్ బ్లెస్ యూ
మై డియర్ జగన్ అన్నారు.
ఇక గతంలో ప్రజారాజ్యం పార్టీ
అధ్యక్షుడు చిరంజీవి తన పార్టీకి ఓటు
వేసిన ఓటర్లను మోసం చేశారని పోసాని
కృష్ణ మురళి అన్నారు. సామాజిక
న్యాయం పేరుతో పార్టీని స్థాపించి గత సాధారణ ఎన్నికల్లో
సీట్లు గెలిచి ఇప్పుడు కాంగ్రెసులో తన పార్టీని విలీనం
చేయడం దురదృష్టకరమన్నారు. అలా చేయడం ప్రజలను
మోసం చేసినట్లే అన్నారు. ఇప్పుడున్న పార్టీలలో కెల్లా మాజీ పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీయే మంచిదన్నారు. అందుకే ఆయన పార్టీలో చేరానని
చెప్పారు.
ప్రస్తుత
పరిస్ధితిపై స్పందిస్తూ...మా నాన్న మీద
ప్రేమతో... నా మీద, నా
తల్లి మీద నమ్మకంతో ఈ
జనం ఓట్లేస్తారన్న నమ్మకం నాకుంది. ఓట్ల కోసం డబ్బు
పంచడమనేది నా పాలసీకే విరుద్ధం.
ప్రజల మీద నాకు పూర్తి
విశ్వాసం ఉంది’’...
ఈ మాటలు మొన్నటి కడప
ఉప ఎన్నికలో వైఎస్ జగన్ స్వయంగా
చెప్పినవి. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని.
అలాంటి విలువలున్న మనిషిని ఎవరెవరితోనో పోలుస్తూ... అవమానిస్తూ... అనుమానిస్తూ ‘సాక్షి’ అకౌంట్లను సీజ్ చేయడం ఏ
మాత్రం సమంజసం, సంస్కారం కాదు. సాక్షి అకౌంట్లలో
ఉన్న డబ్బు సక్రమమా? అక్రమమా?
చెప్పలేమని సీబీఐ కోర్టే స్వయంగా
ఒప్పుకుంది అని చెప్పుకొచ్చారు.
0 comments:
Post a Comment