పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ స్టయిల్,
భావజాలానికి తగిన విధంగా డిజైన్
చేయబడిన దుస్తులు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. Spidos’s షోరూం వారు ‘పవర్
స్టార్’
బ్రాండ్ దుస్తులను అభిమానులకు అందుబాటులోకి తేనున్నారు. కొత్తగా ప్రవేశ పెట్టిన వీటిని పవన్ కళ్యాణ్ స్వయంగా
ప్రారంభించబోతున్నారు.
ఈ విషయమై పంజా నిర్మాత నీలిమ
తిరుమల శెట్టి ట్విట్లర్లో స్పందిస్తూ...ఈ ఆదివారం(మే
27)న పవన్ కళ్యాణ్ వీటిని
ప్రారంభించబోతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల
అభిరుచికి తగిన విధంగా రూపొందించిన
దుస్తులు ‘పవర్ స్టార్’ బ్రాండ్ పేరుతో ఇక్కడ అందుబాటులోకి ఉండనున్నాయి
అని తెలిపారు.
పవర్
కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం
‘గబ్బర్ సింగ్’ చిత్రంతో పాటు ఇతర సినిమాల్లో,
ఫంక్షన్లలో పవర్ స్టార్ ధరించిన
వివిధ రకాల స్టయిల్స్ ఇక్కడ
అభించనున్నట్లు తెలుస్తోంది. వీటికి ‘పవర్ స్టార్’ అనే బ్రాండ్ నేమ్
పెట్టడం ద్వారా భారీ ఎత్తున అమ్మకాలు
జరుగుతాయని భావిస్తున్నారు.
0 comments:
Post a Comment