అశ్వనీదత్
తాజాగా రవితేజతో పరుశరాం దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందిస్తున్న
సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో
త్రిష, అమలాపౌల్ నటించనున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వాళ్లిద్దరూ
వేర్వేరు కారణాలతో ఆ ప్రాజెక్టులనుంచి తప్పుకున్నామంటూ
తెలిసింది. అయితె రెమ్యునేషన్ విషయంలోనే
నచ్చక ఈ హాట్ హీరోయిన్స్
బయిటకు వెళ్లారని చెప్పుకున్నారు. ఈ నేపధ్యంలో ఈ
చిత్రంలో చేయటానికి కాజల్ ముందుకు వచ్చి
ఖరారైంది. కాజల్ గతంలో ఇదే
బ్యానర్ లో ఓ శాంతి
ఓం చిత్రం చేసింది. అయితే త్రిషను అస్సలు
తాము సంప్రదించలేదని అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ కొట్టిపారేసింది.
నిర్మాత
ప్రియాంక దత్ మీడియాతో మాట్లాడుతూ...ప్రాంక్ గా చెప్పాలంటే మేము
ఆధారంలేని రూమర్స్ ని పట్టించుకోం. మేము
మా చిత్రం ప్రీ ప్రొడక్షన్ లో
బిజీగ ఉన్నాం. పరుశరాం ఈ చిత్రాన్ని డైరక్ట్
చేస్తున్నారు. కాజల్ ఆ పాత్రకు
కరెక్టుగా సూటవుతుందని భావించి తీసుకున్నాము అన్నారు. అలాగే ఫిల్మ్ క్రూ
లోని మరొకరు మాట్లాడుతూ..మేము ఎప్పుడూ త్రిషను,అమలా పౌల్ ని
ఎప్రోచ్ కాలేదు. అయితే మేము కొన్ని
పేర్లు అయితే అనుకున్నాం. కాజల్
కి మాత్రమే కథని నేరేట్ చేసాం.
ఆమె జూన్ 15 నుంచి డేట్స్ ఎలాట్
చేసింది అన్నారు.
వైజయంతి
మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత
అశ్వనీ దత్ ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. రవితేజ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘సారొస్తారా’ అనే
టైటిల్ ని అనుకున్నారు. పరశురాం
దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో
ప్రారంభం కానుంది. అయితే ఈ లోగా
ఈ చిత్రం టైటిల్ ని ‘సారొచ్చారు’ అంటూ మార్చారు. గతంలో
రవితేజ-పరశురాం కాంబినేషన్లో ‘ఆంజనేయులు’ చిత్రం రూపొందింది.
ప్రస్తుతం
రవితేజ నటించిన‘దరువు’ చిత్రం ఈ నెల 25న
విడుదలకు సిద్దంగా ఉంది. శివ(శౌర్యం
ఫేం) దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ గా శ్రీ వెంకటేశ్వర
ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్
గా నటించింది. ఎవరితోనైనా గొడవకు దిగండి. కానీ మాస్తో
పెట్టుకోకండి. వాళ్ల దగ్గర కాస్త
పొగరు ఎక్కువ. ఆనందం వచ్చినా, ఆవేశం
వచ్చినా తీన్మార్ ఆడేస్తారు.
ఆ కుర్రాడూ అంతే. నోటితో పోయేదాన్ని,
చేతి దాకా తెచ్చుకొంటాడు. గొడవకు
దిగడం అంటే మహా సరదా...
అనే కాన్సెప్టుతో 'దరువు' సినిమా రూపొందించారు.
0 comments:
Post a Comment