రామ్
చరణ్, వినాయిక్ కాంబినేషన్ లో ఓ చిత్రం
రూపొందుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్
కమెడీగా రూపొందుతన్న ఈ చిత్రంలో రామ్
చరణ్ ద్వి పాత్రాభినయం చేస్తున్నట్లు
వార్తలు వచ్చాయి. అయితే అవి రూమర్స్
కాదని నిజమేనని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు. అలాగే
వినాయిక్ ..చరణ్ చేసే రెండు
పాత్రలూ కూడా చాలా ఢిఫెరెంట్
గా తీర్చిదిద్దుతున్నాడని సమాచారం. ఎన్టీఆర్ అదుర్స్ తరహాలో రెండు పాత్రలతో పుల్
కామెడీ పండించనున్నారని అంటున్నారు. ఇక ఈ చిత్రం
చిరంజీవి రౌడీ అల్లుడు చిత్రం
గుర్తుకు వస్తుందని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ చిత్రాన్ని యూనివర్సల్
మీడియా సంస్థ బ్యానర్ పై
నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథ...
తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు
ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్ సీన్స్
ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని
సినిమా. దర్శకుడు వినాయక్ చిత్రం గురించి చెబుతూ ''చిరంజీవిగారితో 'ఠాగూర్' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి.
తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తామని అన్నారు.
నిర్మాత
ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...చరణ్ని ఒక
కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు
దర్శకుడు. వినోదం, యాక్షన్... తదితర అంశాలు అభిమానుల్ని
మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా
సాగుతుంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఈ కథలో మరో హీరోయిన్
కీ స్థానం ఉంది. ఆమె అమలా
పౌల్. ఈ చిత్రంలో హీరోయిన్
గా కాజల్ చేస్తోంది.'మగధీర'
తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిదే.
సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, కథ, మాటలు: ఆకుల
శివ,ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.
ప్రస్తుతం
రామ్ చరణ్ ఈ చిత్రంతో
పాటు జంజీర్ రీమేక్ లో చేస్తున్నారు. అమితాబ్
కెరిర్ లో సూపర్ హిట్
గా నిలిచిన ఈ చిత్రాన్ని ఈ
కాలానికి మార్చి ఆయిల్ మాఫియా బ్యాక్
డ్రాప్ లో హిందీ,తెలుగు
భాషల్లో తీస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లి
దర్శకత్వంలో ఎవడు చిత్రం షూటింగ్
లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. ఈ
చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను చిత్రంలో చేయనున్నారు. ఆ చిత్రాన్ని దుర్గా
ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్
తో నిర్మిస్తున్నారు.
0 comments:
Post a Comment