రవితేజ
తాజా చిత్రం దరువు ఈ రోజు
ప్రపంచమంతటా భారీ ఎత్తున విడుదలైంది.
యమదొంగ, యమగోల కలిసి వండినట్లున్నగా
ఉన్న దరువు చిత్రంలో రవితేజ
బుల్లెట్ రాజా గా కనిపిస్తాడు.
ఏ పనైనా వెనకా ముందు
ఆలోచించకుండా చేసేసే బుల్లెట్ రాజా ఓ రోజు
చనిపోతాడు. యముడు మీద కోపంతో
చిత్ర గుప్తుడు అతని ఆయుస్సు అవ్వకుండా
రవితేజను చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న
రవితేజ.. యమగోల, యమదొంగ టైప్ లో యముడుపై
యుద్దం ప్రకటిస్తాడు. అక్కడున్న వారసత్వాన్ని ప్రశ్నించి చివరకు తిరిగి భూమి మీదకు వెళ్లిపోవటానికి
ఫర్మిషన్ సంపాదిస్తాడు.
అయితే
అతని శరీరం అప్పటికే కాలి
బూడిద అయిపోతుంది. దాంతో రవితేజను ఏ
శరీరంలో పంపాలా అని ఆలోచనలో పడి...
ఒకరిని పోలిన మనష్యులు ఏడుగురు
భూలోకంలో ఉంటారనే కాన్సెప్టుతో ముందుకు వెళ్తారు. వాళ్లలో ఎవరో ఒకరిని సెట్
చేయటానికి ప్రయత్నిస్తారు. అందులో ఒక రూపం టెర్రరిస్టు.
దానికి రవితేజ ఒఫ్పుకోడు. అలా ఏడు రూపాలు
రిజెక్టు చేస్తాడు. అప్పుడు త్వరలో చనిపోనున్న హోం మినిస్టర్ శరీరంలో
చూపెడతారు.
ఆ హోం మినిస్టర్ బేసిక్
గా దుర్మార్గుడు. ఓ చిన్న సంఘటనతో
ఆ హోం మినిస్టర్ మారిపోయి..
జనాలకి డబ్బులు పంచిపెట్టడం మొదలెడతాడు. దాంతో అతని పార్టనర్స్
లేపేసారు. ఇప్పుడు ఆ మినిస్టర్ శరీరంలో
కి బుల్లెట్ రాజా ప్రవేశిస్తాడు. హోం
మినిస్టర్ తల్లి జయసుధ. హోం
మినిస్టర్ రూపంలోకి మారిన దగ్గరనుంచి రవితేజ
హంగామా స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ వేసారు.
హోం మినిస్టర్ రూపంలో ఉన్న రవితేజ.. జనాలకి
మంచి పనులు చేస్తూంటాడు. హోం
మినిస్టర్ గా రవితేజ పొలిటీషన్స్..
డబ్బు పట్టిస్తూ.. జనాలకి మంచి చేస్తూ బిజీగా
ఉంటాడు.య హీరో అవినీతిని
నిర్మూలించే పనిలో ఉంటాడు. ఎవరైనా
లంచం అడిగితే వీడియో తీసి ఎమ్ ఎమ్
ఎస్ చెయ్యాలి అంటాడు. ఇలా సెకండాఫ్ మొత్తం
హీరో సేవా కార్యక్రమాలు చేస్తూంటాడు.
ఈ లోగా రవితేజ మళ్లీ
చనిపోయే టైమ్ దగ్గర పడింది.
మెయిన్ విలన్ తప్ప ఛోటా
విలన్స్ అందరూ హీరో మంచి
పనులకు మారిపోయి ఫేవర్ గా మారిపోతారు.
హీరోని షూట్ చేసారు. జనాలు
అందరూ.. రవితేజ బ్రతకాలని ప్రార్దిస్తూంటారు. అప్పుడే పుట్టిన పిల్లాడు కూడా బ్రతకాలలని అనుకోవటం
వల్ల హీరోని యముడు వదిలేసాడు.
ఇక హీరోయిన్ శ్వేత(తాప్సీ) విషయానికి
వస్తే...ఆమె భరత నాట్య
కళా కారణి. వాళ్ల బావ విలన్.
హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని
తెగ ట్రై చేస్తూంటే..రవితేజ
దానిని తప్పించటానికి ప్రయత్నిస్తూంటాడు. ఓ ఫైట్,సాంగ్
అన్నట్లు గా సాగుతుంది. ఈలోగా
బ్ర్హహ్మానందం విద్యాబాలన్ పాత్రలో కనపిస్తాడు. బ్రహ్మానందం అసిస్టెంట్ పేరు నిత్యామీనన్.
0 comments:
Post a Comment