నెల్లూరు:
కాంగ్రెసు నెల్లూరు లోకసభ స్థానం అభ్యర్థి
తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి ఆస్తుల విలువ రూ. 320 కోట్లు
ఉన్నాయి. ఆయన గురువారం అట్టహాసంగా
నామినేషన్ దాఖలు చేశారు. తన
భార్యకు, తనకు కలిపి ఉన్న
ఆస్తులను నామినేషన్ అఫిడవిట్లో ఆయన చూపించారు.
గురువారం దాఖలైన నామినేషన్లోని అఫిడవిట్లో
వివరాల ప్రకారం - టిఎస్ఆర్ పేరిట
చరాస్తుల విలువ 88.24 కోట్ల రూపాయలుగా ఉంది.
అందులో నగదు, బ్యాంక్ బ్యాలెన్స్‌ల ప్రకారం 1.48 కోట్ల
రూపాయలు ఉన్నాయి.
వివరాలు
తెలిపిన, తెలపని కంపెనీ షేర్ల విలువ 62.79 కోట్ల
రూపాయలు, వాహనాలు 14.6లక్షల రూపాయలు, బంగారం
23.65లక్షల రూపాయలు, షేర్ దరఖాస్తుల నగదు
23.44కోట్ల రూపాయలు, సేకరించిన డిపాజిట్లు 13.66లక్షల రూపాయలుగా ఉంది.
స్థిరాస్తుల విలువ 95.12కోట్ల రూపాయల వరకు
ఉంది. విశాఖపట్నం వద్ద వ్యవసాయేతర భూమి
4.16 ఎకరాలు (దీనివిలువ రెండున్నర కోట్ల రూపాయలు), చెన్నై,
సికింద్రాబాద్, విశాఖపట్నంల్లో వాణిజ్యపరమైన స్థలం (దీనివిలువ 63.93కోట్ల రూపాయలు).
హైదరాబాద్
నగరంలో నివాస స్థలం (దీనివిలువ
28.69 కోట్ల రూపాయలు) ఉంది. సుబ్బరామిరెడ్డి భార్య
ఇందిర పేరిట 270.23 కోట్ల రూపాయలు, అప్పులు
149.99 కోట్ల రూపాయలుగా వివరించారు. ఆమె పేరిట ఉన్న
చరాస్తుల విలువ 243.58 కోట్ల రూపాయలుగా చూపించారు.
అందులో చేతిలో నగదు, బ్యాంక్ బ్యాలెన్స్
89లక్షల రూపాయలు, ఫిక్స్డ్ డిపాజిట్లు అరవై
వేల రూపాయలు, తెలిపిన, తెలపని కంపెనీ షేర్ల విలువ 195.62కోట్ల
రూపాయలు, బీమా మొత్తం పది
లక్షల రూపాయలు, వాహనాల విలువ తొంభై వేల
రూపాయలు, బంగారు నగల విలువ 4.07 కోట్ల
రూపాయలు, షేర్ దరఖాస్తుల నగదు
33.12 కోట్ల రూపాయలు, సేకరించిన డిపాజిట్లు 9.62కోట్ల రూపాయలుగా వెల్లడించారు.
సుబ్బిరామిరెడ్డి
సతీమణి పేరిట స్థిరాస్తుల మొత్తం
26.65 కోట్ల రూపాయల్లో విశాఖ వద్ద ఉన్న
4.16 ఎకరాల వ్యవసాయేతర భూమి విలువ 1.56కోట్ల
రూపాయలు, చెన్నై, విశాఖపట్నంల్లో వాణిజ్యపరమైన స్థలం విలువ 17.28 కోట్ల
రూపాయలు, హైదరాబాద్లో నివాసిత భూమి
విలువ 7.81 కోట్ల రూపాయలుగా తెలిపారు.
వివిధ బ్యాంకుల్లో తన పేరిట రెండుకోట్ల
రూపాయలకుపైగా, భార్య ఇందిర పేరిట
149కోట్ల రూపాయల వరకు రుణాలు ఉన్నట్లు
వివరాలు వెల్లడించారు.
0 comments:
Post a Comment