హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయితే పార్టీలో ఏమవుతుందో
ఇప్పుడే తాను చెప్పలేనని, విచారణ
పూర్తయ్యాక దానిపై మాట్లాడతానని అనకాపల్లి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి శుక్రవారం
అన్నారు. సబ్బం హరి శుక్రవారం
వైయస్ జగన్తో పాటు
సిబిఐ కార్యాలయానికి వచ్చారు. జగన్ విచారణ కోసం
లోనికి వెళ్లిన తర్వాత బయటకు వచ్చిన సబ్బం
హరి మీడియాతో మాట్లాడారు.
మోపిదేవి
వెంకటరమణ అరెస్టుపై స్పందిస్తూ.. వివాదాస్పదంగా 26 జివోలు జారీ అయితే మంత్రులను
విచారించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని తాను మొదటి నుండి
డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. జగన్ అరెస్టుపై ఎవరికి
ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారని, ప్రచారం చేస్తున్నారని
విమర్శించారు. సిబిఐ దర్యాఫ్తు వన్
టు వన్ జరుగుతుందని అన్నారు.
విచారణ చేస్తున్నప్పుడు థర్డ్ పర్సన్ ఉండరన్నారు.
అందుకే
తమను అధికారులు బయటకు పంపించారని చెప్పారు.
ఎవరినీ లోనికి పంపించలేదన్నారు. తాను జగన్తో
వెళుతున్నందుకు కాంగ్రెసు తనను ఏం చేసినా
పట్టించుకోనని చెప్పారు. తాను దివంగత ముఖ్యమంత్రి
వైయస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే వాడినన్నారు. అందుకే జగన్ వెంట ఉంటున్నానని
తెలిపారు. ఎప్పుడూ జగన్ వెంటే ఉంటానని
చెప్పారు. విచారణ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు. విచారణ అంతా రాజకీయ డ్రామా
అని ఆరోపించారు. కాగా సిబిఐ కార్యాలయం
ఉన్న దిల్కుషా పరిధిలో
మీడియాతో మాట్లాడినందుకు సబ్బం హరిని పోలీసులు
అరెస్టు చేశారు.
జగన్
ఏ తప్పు చేయలేదు కాబట్టే
ప్రజలలో ధైర్యంగా తిరుగుతున్నారని మాజీ మంత్రి కొణతాల
రామకృష్ణ అన్నారు. ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని
అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా
తమ పార్టీ గెలుపు ఆపలేరన్నారు. ఆ పార్టీలు వలసలతో
జీరోలుగా మారుతాయన్నారు. న్యాయం కోసం ఎవరైనా జగన్
పార్టీలో చేరుతారన్నారు.
0 comments:
Post a Comment