జ్ఞాపక
శక్తి తగ్గిపోతోందా? ఎంత గుర్తు పెట్టుకోవాలని
ప్రయత్నించినా గుర్తుండటం లేదా? ఉదయం జరిగిన
సంఘటనలు సాయంత్రానికి మరచిపోతున్నారా? మీ గాల్ ఫ్రెండ్
బర్త్ డే లాంటి వి
కూడా మరచిపోతున్నారా? అలాగయితే ప్రమాదమే. మీ జ్ఞాపక శక్తి
సహజంగా మెరుగుపడాలంటే, మీరు గుర్తుంచుకోవాల్సినవి గుర్తుంచుకొని ఆనందించాలంటే,
కొన్ని ఆహారాలు తినాలి. పటుత్వం తగ్గిపోయే మీ బ్రెయిన్ కణాలను
ఆరోగ్యం చేయాలంటే సరైన ఆహారాలు తినాలి.
అది ఎలా? అవి అన్నిచోట్లా
దొరికే ఆహారాలు కనుక తినటం తేలిక,
సైడ్ ఎఫెక్ట్స్ వంటివి అసలే వుండవు. కనుక
నేటినుండి ఈ ఆహారాలు తింటూ
మీ మెమొరీ సామర్ధ్యానికి అందరిని ఆశ్చర్యపరచండి.
చాక్లెట్
లు - చాక్లెట్ వంటి ఆహారాలు ఎపుడూ
తినటానికి ఆనందంగానే వుంటాయి. చాక్లెట్ లు మీ బ్రెయిన్
పవర్ ను పెంచుతాయని రీసెర్చి
చెపుతోంది. ప్రతిరోజూ ఒక చాక్లెట్ తింటే
అది వయసు పైబడినందువలన వచ్చే
మీ మతిమరపుపై సమర్ధవంతంగా పోరాడుతుంది. చాక్లెట్ లలో పాలీఫెనాల్స్ వుంటాయి.
అవి మీలోని రక్తప్రసరణను బ్రెయిన్ దిశగా అధికం చేస్తాయి.
అయితే, ప్రతిరోజూ పెద్ద చాక్లెట్ వంటివి
తినకండి. బ్రెయిన్ బాగా పనిచేయాలంటే రోజూ
10 గ్రాముల చాక్లెట్ లంచంగా పెడితే చాలు ఇక ఏం
చెప్పినా మీకు అది విషయాలన్నీ
గుర్తుండిపోయేలా చేస్తుంది.
బ్లాక్
బెర్రీలు - బ్లాక్ బెర్రీ అంటే ఫోన్ అనుకునేరు
సుమా? కాదు. నల్లటి బెర్రీలు
తింటే, మీ కన్నీ గుర్తుంటాయి.
మీ శరీరంలో కణాలు ప్రతి ఒక్కటి
కూడా దేనికదే. ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటూ వుంటాయి ఇవి తింటే. మాట్లాడుకుని
చివరకు బ్రెయిన్ కు చేరవేస్తాయి. వయసు
పెరిగితే ఈ ఈ ప్రక్రియ
బ్రెయిన్ కు చేరేసరికి ఆలస్యమవుతుంది
బ్లాక్ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం.
అవి మీరు త్వరితంగా అవగాహన
చేసుకునేందుకు తోడ్పడతాయి. మరి మధ్యాహ్నం అయ్యే
సరికి స్నాక్స్ గా బ్లాక్ బెర్రీలు
తింటే, శరీరమంతా సమాచార విస్తరణ బాగా జరుగుతుంది.
ఆలివ్
ఆయిల్ - ఆలివ్ ఆయిల్ మీ
చర్మానికి ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలిస్తుంది. అదే మాదిరి మీ
బ్రెయిన్ కి కూడాను. అల్జీమర్స్
వ్యాధికి వ్యతిరేకంగా బ్రెయిన్ సెల్స్ లో పనిచేస్తుంది. మతిమరపు
రాకుండా తోడ్పడుతుంది. కనుక మీ వంటనూనెను
ఆలివ్ నూనె కు నేడే
మార్చి వేయండి.
బీట్
రూట్ - ఎర్రగా వుంటే బీట్ రూట్
మతిమరపు తగ్గించేందుకు బాగా పనిచేస్తుంది. అయితే
మనలో చాలామంది బీట్ రూట్ తినటానికి
ఇష్టపడరు. దీనిలోని నైట్రేట్స్ మీ రక్తనాళాలను బాగా
తెరిచి అధిక ఆక్సిజన్ అందేలా
చేస్తాయి. రక్తాన్ని బ్రెయిన్ కు బాగా పంపుతాయి.
కనుక తియ్యగా వుండే బీట్ రూట్
ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్
లో తినండి లేదా జ్యూస్ తాగండి.
రుచి మీకు నచ్చకుంటే, కొద్దిగా
నిమ్మరసం, మిరియం వంటివి వేసి రుచిగా తాగండి.
బ్రెయిన్ పవర్ పెంచుకోండి.
0 comments:
Post a Comment