న్యూఢిల్లీ:
రాజ్యసభ సభ్యురాలిగా ప్రముఖ సినీ నటి రేఖ
మంగళవారం ప్రమాణం చేశారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రేపు
బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిద్దరిని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
సచిన్
టెండూల్కర్ను రాజ్యసభకు నామినేట్
చేయడం పట్ల సర్వత్రా హర్షం
వ్యక్తమైంది. అదే సమయంలో చాలా
మంది సచిన్ టెండూల్కర్ రాజకీయాల్లోకి
అడుగు పెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం
చేశారు. రేఖ పలు హిందీ
సినిమాల్లో నటించారు. ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు.
సచిన్
గొప్ప ఆటగాడని, సచిన్ అంటే గర్వంగా ఫీలవుతామని,
రాజ్యసభకు నామినేట్ అయితే పార్లమెంటుకు సమయం
కేటాయిస్తారని భావిస్తున్నానని బిజెపి అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్
అన్నారు. సచిన్ టెండూల్కర్ పార్లమెంటుకు
రావడం బాగుంటుందని కాంగ్రెసు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు.
సచిన్
టెండూల్కర్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే అసంతృప్తి కలుగుతుందని సీనియర్ జర్నలిస్టు, ఎంపి హెచ్కె
దువా అన్నారు. సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు
వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం పట్ల మాజీ క్రికెట్
సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment