తెరపై
ఒక్క డైలాగు కూడూ చెప్పకుండా కేవలం
హావ భావాలతో నవ్వించగల సత్తా ఉన్న హాస్య
నటుడు బ్రహ్మానందం. అయితే ఆయన ఈ
మధ్యన సినిమాల్లో సెలబ్రేటీలను అనుకరిస్తూ నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విద్యా బాలన్ అంటూ దరువులో
ఓ డాన్స్ మాస్టర్ పాత్రను వేస్తున్నారు. ఆ పాత్ర పూర్తిగా
నేషనల్ అవార్డు విన్నర్..డాన్స్ మాస్టర్ ని ఉండేలా గెటప్
ఇచ్చారు. అచ్చం ఆయనలా డ్రెస్సింగ్
చేసి,మెళ్లో ఆయన వేసుకునే చైన్,నుదుటిపై ఆయన పెట్టుకునే తరహాలో
బొట్టు పెట్టారు. ఆయన మగధీరలో ధీర..ధీర సాంగ్ చేస్తే
దానికి నేషనల్ అవార్డు వచ్చింది.
ఇక దీనిని పరిశ్రమకు చెందిన కొందరు సీనియర్స్ వ్యతిరేకిస్తున్నారు. కామెడీ పేరుతో గౌరవనీయమైన వ్యక్తులను కించపరచటం ఎంతవరకూ సబబు అంటున్నారు. బయిట
ఆ టెక్నిషియన్స్ ఉన్న వ్యక్తిగత విభేధాలను
దృష్టిలో పెట్టుకుని తెరపై వారిని సెటైర్
చేసి పరువు తీసే కార్యక్రమాలు..దిగజారుడుతనానికి నిదర్శనం అంటున్నారు. ఇక ఈ చిత్రంలో
బ్రహ్మానందం పాత్ర డాన్స్ ఇనిస్టిట్యూట్
ని నడుపుతూంటుంది.
దరువు
విషయానికి వస్తే... రవితేజ క్యారెక్టర్ గురించి దర్శక నిర్మాతలు చెపుతూ…అతను
పక్కా మాస్. మనిషి మాస్క్
వేసుకున్న ట్రాన్స్ఫార్మర్లాగా పూర్తి ఎనర్జీతో
ఉంటాడు. శత్రువులకు అతనంటే బెదురే. అతగాడు దరువేశాడంటే భూగోళం దద్దరిల్లాల్సిందే. ఈ తరహా మనస్తత్వంతోనే
రవితేజ పాత్రను తీర్చిదిద్దాం అన్నారు. అలాగే కొంచెం యాక్షన్కి, ఇంకొంచెం సున్నితమైన
భావోద్వేగాలకూ చోటుంటుంది. ఈ కొలతలతో మరో
సినిమా సిద్ధమైపోతోంది. ఈసారి మాత్రం వినోదాల
సౌండ్ ఎక్కువే. మాస్తో తీన్మార్ ఆడించే కథతో
వస్తున్నారని చెప్పారు.
ఈ నెల 25న చిత్రాన్ని
గ్రాండ్ గా విడుదల చేసేందుకు
సన్నాహాలు చేస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్
గా నటిస్తోంది. శివ దర్శకత్వం వహించిన
ఈ చిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ శ్రీ వెంకటేశ్వర ఎంటర్
టైన్మెంట్స్ బేనర్ పై నిర్మించారు.
యమలోకం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ
చిత్రం ఓ సోషియో పాంటసీ.
బ్రహ్మానందం, సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అవినాష్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ
చిత్రానికి కథ, స్క్రీన్ప్లే:
శివ, ఆదినారాయణ, సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా:
వెట్రివేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: నాగమునీశ్వరి
0 comments:
Post a Comment