హైదరాబాద్:
తమ పత్రికకు ప్రభుత్వ ప్రకటనల జారీ నిలిపేస్తూ జారీ
చేసిన ఆదేశాలను సాక్షి దినపత్రిక సంపాదకుడు మురళి సోమవారం హైకోర్టులో
పిటిషన్ దాఖలు చేశారు. ఈనాడు,
ఆంధ్రజ్యోతి పట్ల ఒక రకంగా,
తమ పట్ల మరో రకంగా
వ్యవహరిస్తున్నారంటూ పిటిషన్లో ఆరోపించారు. ప్రభుత్వం
జారీ చేసిన జీవో నెంబర్
2097ను రద్దు చేస్తూ ఆదేశాలు
జారీ చేయాలని మురళి హైకోర్టును కోరారు.
ప్రభుత్వ
శాఖలు,త సంస్థలు, కార్పొరేషన్లు,
ప్రభుత్వ రంగ సంస్థల నుంచి
ప్రకటనలు నిలిపేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో
చట్ట విరుద్ధమని ప్రకటించాలని ఆయన కోరారు. రాజ్యంగంలోని
ఆర్టికల్ 19(1) ప్రకారం 2097 జీవోను రద్దు చేయాలని ఆయన
విజ్ఝప్తి చేశారు. సాక్షి మీడియా పట్ల ప్రభుత్వం పక్షపాత
ధోరణి అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు.
ఈనాడు,
ఆంధ్రజ్యోతి దినపత్రికలపై ఎన్ని కేసులున్నా పట్టించుకోని
ప్రభుత్వం సాక్షి విషయంలో మాత్రం కేసులను సాకుగా చూపి, ప్రకటనలను నిలిపేస్తూ
జీవో జారీ చేయడం చట్టవిరుద్ధమని
ఆయన అన్నారు. ఈ పిటిషన్పై
విచారణ బుధవారం జరగనుంది.
ఇదిలావుంటే,
రామోజీ రావుపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అంటూ అందువల్ల రామోజీ
పత్రికకు ప్రకటనలు నిలిపేయాలని కోరుతూ రిటైర్డ్ ప్రొఫెసర్ రామస్వామి, న్యాయవాది ధర్మారెడ్డి విడి విడిగా రెండు
పిటిషన్లు దాఖలు చేశారు.
సాక్షి
మీడియా బ్యాంకు ఖాతాలను సిబిఐ స్తంభింపజేసిన నేపథ్యంలో
ఆ మీడియాకు ప్రభుత్వ ప్రకటనన జారీని నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
దీంతో ప్రభుత్వం నుంచి సాక్షి మీడియాకు
వాణిజ్య ప్రకటనలు ఆగిపోయాయి.
0 comments:
Post a Comment