చెన్నై:
కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత
నివాసంలో 35 కోట్ల రూపాయలు స్వాధీనం
చేసుకున్నట్లు ఆదాయం పన్ను (ఐటి)
శాఖ ప్రకటించింది. చెన్నైలోని సుస్మిత నివాసంలో శనివారం తాము నిర్వహించిన సోదాలపై
ఐటి శాఖ సోమవారం ఓ
ప్రకటన విడుదల చేసింది. చిరంజీవి కూతురు నివాసంలో 4.66 కోట్ల విలువైన దస్తావేజులను
స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
దస్తావేజులకు,
నగదుకు సంబంధించి సరైన సమాధానం రాలేదని
ప్రకటించిన ఐటి శాఖ మరిన్ని
దాడులు నిర్వహిస్తామని తెలిపింది. ఆదాయానికి సంబంధించి సరైన వివరాలు అందించలేదనే
ఆరోపణలతో ఐటి అధికారులు ఈ
సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఐటి శాఖ అధికారులు
తొలుత చిరంజీవి వియ్యంకుడికి వియ్యంకుడి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత చిరంజీవి
వియ్యంకుడి నివాసంలో సోదాలు నిర్వహించారు.
చిరంజీవి
కూతురు సుస్మిత ఇంట్లో సోదాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిచ్చు పుట్టింది. సుస్మిత నివాసంలో లభించిన సొమ్ము చిరంజీవికి సంబంధించిందని, దాన్ని ఉప ఎన్నికల్లో ఖర్చుకు
నిర్దేశించారని అనుమానాలు వ్యక్తం చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు
చెందిన సాక్షి టీవీ ఓ వార్తాకథనాన్ని
ప్రసారం చేసింది. ఐటి శాఖ దాడుల
నుంచి బయటపడడానికి చిరంజీవి నేరుగా చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లారని
సాక్షి టీవీ వ్యాఖ్యానించింది.
సాక్షి
టీవీ వార్తాకథనంపై అదే రోజు చిరంజీవి
భగ్గుమన్నారు. తన వ్యక్తిత్వహననానికి సాక్షి టీవీ
తప్పుడు వార్తాకథనాన్ని ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు. వైయస్
జగన్పై ఆయన తీవ్ర
వ్యాఖ్యలు చేశారు. తనపై చానెల్ అసత్య
ప్రచారం సాగిస్తోందని, ప్రజలకు అపోహలు కలిగిస్తోందని, ఆ వార్తాకథనానికి టీవీ
చానెల్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తిరుపతిలో
ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత తాను చెన్నై వెళ్లానని,
ఈ ఉదయమే తాను హైదరాబాదుకు
వచ్చానని ఆయన చెప్పారు.
వాస్తవాలను
దాచి పెట్టి తాను తన కూతురింటికి
వెళ్లినట్లు, ఐటి అధికారులు సొమ్ము
పట్టుకోవడంతో తాను ఢిల్లీకి వెళ్లినట్లు
టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసిందని ఆయన అన్నారు. తాను
ఢిల్లీ వెళ్లలేదని, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment